తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi : జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్ - ప్రధాని మోదీ

PM Modi : జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్ - ప్రధాని మోదీ

06 May 2024, 17:11 IST

    • PM Modi : వైసీపీ ప్రభుత్వం అవినీతిని జెట్‌ స్పీడ్‌తో పరిగెత్తించిందని ప్రధాని మోదీ విమర్శించారు. 5 ఏళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, అప్పుల ఊబిలో నెట్టేసిందన్నారు. మూడు రాజధాను పేరిట లూటీ చేశారన్నారు.
ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

PM Modi : ఏపీ చంద్రబాబు పాలనలో.. అభివృద్ధిలో టాప్ ఉండేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పట్టాలు తప్పిందని ప్రధాని మోదీ ఆరోపించారు. గోదావరి మాతకు ప్రణామాలు, ఈ నేల మీద ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే కొత్త చరిత్ర లిఖించబోతున్నామంటూ ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. రాజమండ్రి ఎన్డీఏ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేశారు. 5 ఏళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, అప్పుల ఊబిలో నెట్టేసిందన్నారు. ప్రజల మంచి కోసం పని చేసే ఏకైక గ్యారెంటీ ఎన్డీఏ అన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులన్నీ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు పూర్తి చేస్తుందన్నారు. ఒకవైపు కాంగ్రెస్ మరో వైపు వైసీపీ ఉందన్నారు. కాంగ్రెస్ గెలవక ముందే ఓటమి ఒప్పుకుంటే, వైసీపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తిరస్కరిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో, రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

అవినీతిలో జెట్ స్పీడ్

వైసీపీ పాలనలో అవినీతిని జెట్‌ స్పీడ్‌తో పరిగెత్తించిందని ప్రధాని మోదీ విమర్శించారు. జగన్ పాలనలో అభివృద్ధి సున్నా, అవినీతి వందశాతం అని సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. ఏపీలో ప్రతిభావంతులైన యువత ఉన్నారని, టెక్నాలజీలో రాష్ట్ర యువత శక్తిని ప్రపంచం గుర్తించిందన్నారు. కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందన్నారు. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్‌ అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. ఈడీ అంటూ గగ్గోలు పెడుతున్న ఇండియా కూటమి నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోందన్నారు. ఆ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.

మూడు రాజధానుల పేరిట మోసం

మూడు రాజధానులు చేస్తామని చెప్పిన సీఎం జగన్...ఏపీని లూటీ చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు మద్యం సిండికేట్‌గా తయారైందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అవినీతి తప్ప ఆర్థిక నియంత్రణ లేదన్నారు. వైసీపీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చినా....రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని ఆరోపించారు. రాజధానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలనుకుందని, కానీ ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేకపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు.

దేశంలో అమృత ఘడియలు, రాష్ట్రంలో విష ఘడియలు

శ్రీరామ చంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకొచ్చిన వ్యక్తి, భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినా వ్యక్తి ప్రధాని మోదీ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రి ఎన్డీఏ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... భారతదేశానికి అభివృద్ధితో పాటు, గుండె ధైర్యం కావాలన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన వ్యక్తి, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ ను బలమైన దేశంగా నిలబెట్టిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుని, జగన్ పేరు పెట్టుకుందన్నారు. అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదన్నారు. మోదీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు ఉంటే, ఏపీలో వైసీపీ పాలనలో విష ఘడియలు నడుస్తున్నాయని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక పద్మ అవార్డులకు గౌరవం తీసుకొచ్చి ఎంతోమంది నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేసి అవార్డులకు గౌరవం తీసుకొచ్చారన్నారు. మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాబోతుందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేసుకోనుంది, రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రశక్తిగా అవతరించనుందన్నారు. దీనికోసం తామంతా నరేంద్ర మోదీతో కలిసి నడుస్తున్నామన్నారు.

ఎన్డీఏ సభలో ఆసక్తికర సంఘటన

రాజమండ్రి సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ సభా వేదికపైకి రాగానే పవన్ కల్యాణ్ శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రధాని మోదీకి పవన్ పాదాభివందనం చేయబోయారు. మోదీ పవన్ ను ఆపుతూ అలా చేయవద్దని సూచించారు. ప్రధాని మోదీ సైతం కిందకి వంగి పవన్ కు నమస్కరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తదుపరి వ్యాసం