CID Case on Chandrababu : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ కేసు నమోదు- ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్-amaravati ap cid filed fir on land titling case a1 chandrababu a2 lokesh case registered ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Cid Case On Chandrababu : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ కేసు నమోదు- ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్

CID Case on Chandrababu : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ కేసు నమోదు- ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 03:31 PM IST

CID Case on Chandrababu Lokesh : ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుపై ఈసీ సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ ఫిర్యాదుపై సీఐడీ చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు చేసింది.

ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్
ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్

CID Case on Chandrababu Lokesh : ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh) గట్టి షాక్ తగిలింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఈసీ(EC)కి ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ సీఐడీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ...చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా, లోకేశ్ ను ఏ2గా చేర్చింది.

ఏ1 గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్

ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) పై అపోహలు కల్పించేలా టీడీపీ వీడియోలు, ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తుందని నిన్న వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణకు ఈసీ ఆదేశాలతో సీఐడీ ఇవాళ కేసు నమోదు చేసింది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిందెవరో తేల్చేలా దర్యాప్తు చేపట్టింది. IVRS కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై సీఐడీ(CID) ఫోకస్ పెట్టింది. దీనిపై పూర్తి విచారణ తర్వాత సీఐడీ ఈసీకి నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబు, లోకేశ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ U/S 171(F)(G), 188, 505(2), R/w 120(B) సెక్షల కింద సీఐడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు(Chandrababu), ఏ2 గా లోకేశ్(Lokesh) పేర్లను చేర్చారు. అలాగే టీడీపీ(TDP), టీడీపీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్, ఐవీఆర్ కాల్స్(IVRS) , వాయిస్ టెక్నీషియన్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

వైసీపీ ఈసీకి ఫిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) ప్రధాన ఆస్త్రంగా మారిన సంగతి తెలిసిందే. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్(IVRS Calls) కూడా చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే వైసీపీ(Ysrcp) ఆరోపిస్తుంది. సీఎం జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారు. దీంతో వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ(EC) సీఐడీని ఆదేశించింది. టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని సీఐడీ(సైబర్ సెల్)(CID)ను ఈసీ ఆదేశించింది. విచారణ జరిపి చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

"వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్(AP Land Titling Act) అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్(Jagan) ఓ ల్యాండ్ గ్రాబర్" అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా...వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈసీ(EC)కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం