PM Modi Tour : తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ(PM Modi), బీజేపీ అగ్రనేతల(BJP Leaders) పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 6న ఏపీలో 8, 10 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మే 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ, తెలంగాణలో పర్యటినున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం(Rajahmundry) కడియం మండలం వేమగిరి నేషనల్ హైవే దగ్గర గల గ్రౌండ్ లో ఈ నెల 6న ప్రధాని మోదీ(PM Modi) బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Diversions) విధించారు. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.
రేపు(మే 05)ధర్మవరం ప్రజాగళం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు.
సంబంధిత కథనం