Janasena Pawan Kalyan: ఆ విషయంలో పవన్ నిర్ణయమే ఫైనల్… అభ్యర్థుల ఎంపికపై గీటు దాటితే వేటే…
27 March 2024, 10:59 IST
- Janasena Pawan Kalyan: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ నిర్ణయమే ఫైనల్ అని, అభ్యర్థుల ఎంపికపై విమర్శలు చేస్తే ఎంతటి వారైనా వేటు తప్పదని ఆ పార్టీ ప్రకటించింది.
జనసేనకు పదికోట్ల విరాళం అందిస్తున్న పవన్ కళ్యాణ్
Janasena Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన Janasena తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో పవన్ కళ్యాణ్ Pawan Kalyan నిర్ణయమే అంతిమం అని, పరిధి అతిక్రమించి మాట్లాడేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జనసేన పార్టీ హెచ్చరించింది.
జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమం Final Decision అని స్పష్టం చేస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారనే విషయం అందరూ అర్థం చేసుకోవాలన్నారు.
పార్టీ అధ్యక్షుడు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు Public Comments, మీడియా Mediaతో పాటు, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తామని స్పష్టం చేవారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి, సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
జనసేన తరపున ఎన్నికల్లో Elections పోటీ చేయాలని భావించిన పలువురు నేతలు ఆందోళనలు దిగుతున్నారు. సీట్ల కేటాయింపులో అసంతృప్తికి గురైన నేతలు పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు నిరసనలు, ఆందోళనలతో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. దీంతో చాలా చోట్ల ఆ పార్టీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశ తప్పలేదు. దీంతో అటు సోషల్ మీడియా ట్రోల్స్‌తో పాటు బహిరంగ వేదికలపై విమర్శలు చేస్తున్నారు.
జనసేనకు పవన్ రూ.పదికోట్ల విరాళం…
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా Donation అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని వెచ్చిస్తున్న పవన్ కళ్యాణ్, ఎన్నికల వేళ మరోసారి భారీ విరాళాన్ని అందించారు.
జనసేన పార్టీ నిర్వహణ కోసం రూ.10 కోట్ల స్వార్జితాన్ని పవన్ కళ్యాణ్ విరాళంగా అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
‘‘స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని, జనసేన పార్టీ ప్రయాణానికి సగటు కూలి తన చిన్నపాటి సంపాదనలో రూ.వంద పక్కన పెట్టి పార్టీ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాడుతున్నారని చెప్పారు.
బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారని పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారని అలాంటి వారి స్ఫూర్తితో నేను సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.