తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Machilipatnam Jsp: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి ఎవరు.. అధికారిక ప్రకటన ఆలస్యంలో మతలబు ఏమిటి?

Machilipatnam JSP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్ధి ఎవరు.. అధికారిక ప్రకటన ఆలస్యంలో మతలబు ఏమిటి?

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:04 IST

google News
    • Machilipatnam JSP: ఎన్నికల పొత్తుల్లో మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయించినా అక్కడ పోటీ చేసే అభ్యర్థి విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు.
జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి
జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి

Machilipatnam JSP: మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్ధిగా నిన్న మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి పేరు వినిపించినా అధికారికంగా ప్రకటించక పోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీని వీడి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం Machilipatnam పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.

మచిలీపట్నంలో loksabha అభ్యర్ధిగా బాలశౌరి, అవనిగడ్డలో బాలశౌరి కుమారుడికి టిక్కెట్ కేటాయిస్తున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. ఆదివారం పవన్ కళ్యాణ్ ప్రకటించిన జాబితాలో మచిలీపట్నం, అవనిగడ్డ నియోజక వర్గాలు మాత్రం లేవు. దీంతో ఏమి జరుగుతోందనే చర్చ జిల్లాలో మొదలైంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించిన Vallabhaneni balasowri బాలశౌరి జనసేనలో చేరారు. సామాజిక సమీకరణలు కుదరడంతో ఆ పార్టీ నుంచి మళ్లీ పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు.జనసేనలో చేరిన తర్వాత బాలశౌరికి చిక్కులు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది.

మచిలీపట్నంలో మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులతో సమస్యలు ఎదురవుతున్నట్టు బాలశౌరి వర్గం చెబుతోంది. దీంతో పాటు ఆర్థిక పరమైన అంశాల విషయంలో స్పష్టత కొరవడటంతోనే బాలశౌరి పేరును అధికారికంగా ప్రకటించడంలో జాప్యం నెలకొందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బాలశౌరిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీకి పుష్కలంగా సహాయ సహకారాలు లభిస్తాయని జనసేన పెద్దలు ఆశించినట్టు చెబుతున్నారు. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతోనే బాలశౌరి అభ్యర్ధిత్వం ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.

మచిలీపట్నంలో పోటీ చేస్తే తన నియోజక వర్గంలో ఎన్నికల ఖర్చుకు మాత్రమే పరిమితం అవుతానని బాలశౌరి స్పష్టం చేయడంతోనే ప్రతిష్టంబన నెలకొందని బాలశౌరి సన్నిహితులు చెబుతున్నారు. జనసేన తరపున పోటీ చేసే ఇతర అభ్యర్థుల భారం తాను మోయలేనని బాలశౌరి తేల్చి చెప్పడంతోనే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో ఆలస్యం అవుతోందని చెబుతున్నారు.

మచిలీపట్నంలో పనిచేస్తున్న జనసేన నేతలు ఎవరైనా అసెంబ్లీకి పోటీ చేస్తే వారికి సహకరించాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. మరికొందరు నేతలు తమ సంగతి తేల్చాలని బాలశౌరిపై ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించ లేదని చెబుతున్నారు.

మచిలీపట్నంలో నెలకొన్న పరిస్థితులతో కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. గ్రీన్‌ కో కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న బండారు నరసింహరావును పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. బాలశౌరి, నరసింహరావుల్లో ఎవరో ఒకరిని ఖరారు చేస్తారని చెబుతున్నారు. మరోవైపు అవనిగడ్డ నియోజక వర్గం విషయంలో కూడా పీఠముడి వీడటం లేదు.

మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ వయోభారంతో పాటు ఎన్నికల ఖర్చును తట్టుకోలేక పోటీ చేయలేనని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ జనసేనకు ఇవ్వడం కూడా మండలిని బాధించినట్టు సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు జనసేనలో అవనిగడ్డ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణలు అవనిగడ్డ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. మచిలీపట్నం ఎంపీతో పాటు అవనిగడ్డ, శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజక వర్గాలకు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్ధుల్ని ఖరారు చేస్తారని చెబుతున్నారు.

తదుపరి వ్యాసం