Janasena Candidates: జనసేన అభ్యర్థుల ఖరారు.. మరో 11పేర్లతో అధికారిక జాబితా విడుదల..మొత్తం 18 స్థానాల్లో ఖరారు
Janasena Candidates: జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసే మరో 11 మంది అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇప్పటి వరకు 18 స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేశారు.
Janasena Candidates: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో 11 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ PawanKalyan జాబితాను విడుదల చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు Chandrababuతో కలిసి మొదట 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
తర్వాత మరో రెండు స్థానాలను అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ Uday Srinivas అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేశారు.
ఏపీలో మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మరో 11 మంది అభ్యర్థుల పేర్లను ఎన్డీయే NDA భాగస్వామ్య పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఖరారు చేసింది.
ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. ఆదివారం మరో 11 మంది పేర్లను ప్రకటించడంతో అభ్యర్థుల సంఖ్య 18కి చేరింది. టీడీపీ, బీజేపీ సహా ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఇందులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను కేటాయించారు.
ఏపీలో పిఠాపురం Pithapuram అసెంబ్లీ స్థానం నుంచి కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఎల్ మాధవి (నెల్లిమర్ల), కె.రామకృష్ణ (అనకాపల్లి), పి.నానాజీ (కాకినాడ రూరల్), బి.బలరామకృష్ణ (రాజానగరం), ఎన్.మనోహర్ (తెనాలి) పోటీ చేస్తున్నారు.
నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పెందుర్తి నుంచి రమేష్‌బాబు, ఎలమంచిలి నుంచి ఎస్.విజయ్ కుమార్, పి.సత్యనారాయణ (పి.గన్నవరం), దేవ వరప్రసాద్ (రాజోలు), బి.శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), పి.ఆంజనేయులు (భీమవరం) పోటీ చేస్తున్నారు.
నరసాపురం నుంచి బి.నాయకర్, ఉంగుటూరు నుంచి పి.ధర్మరాజు, పోలవరం నుంచి సి.బాలరాజు, తిరుపతి నుంచి ఎ.శ్రీనివాసులు, రైల్వేకోడూరు నుంచి వై.భాస్కరరావు పోటీ చేయనున్నారు.
కాకినాడ లోక్ సభ స్థానం నుంచి టి.ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. జనసేన తరపున పోటీ చేసే స్థానాల్లో మరో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. మచిలీపట్నలో వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మచిలీపట్నం పార్లమెంటు స్థానంతో పాటు అవనిగడ్డ అసెంబ్లీ టిక్కెట్ కూడా బాలశౌరి కోరుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ-జనసేన చేరాయి. ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్నాయి. బీజేపీ ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో, టిడిపి 144 అసెంబ్లీ, 17 లోకసభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
18 స్థానాలకు సంబంధించిన జాబితా…
1 పిఠాపురం పవన్ కల్యాణ్
2 నెల్లిమర్ల లోకం మాధవి
3 అనకాపల్లి కొణతాల రామకృష్ణ
4 కాకినాడ రూరల్ పంతం నానాజీ
5 రాజానగరం బత్తుల బలరామకృష్ణ
6 తెనాలి నాదెండ్ల మనోహర్
7 నిడదవోలు కందుల దుర్గేష్
8 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు
9 యలమంచిలి సుందరపు విజయ్ కుమార్
10 పి.గన్నవరం గిడ్డి సత్యనారాయణ
11 రాజోలు దేవ వరప్రసాద్
12 తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్
13 భీమవరం పులపర్తి ఆంజనేయులు
14 నరసాపురం బొమ్మిడి నాయకర్
15 ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు
16 పోలవరం చిర్రి బాలరాజు
17 తిరుపతి ఆరణి శ్రీనివాసులు
18 రైల్వే కోడూరు డా.యనమల భాస్కర రావు
సంబంధిత కథనం