CEO Mukesh Kumar Meena : ఈ నెల 18 నుంచి నామినేషన్లు, సీఈవో ముకేష్ కుమార్ కీలక ఆదేశాలు
12 April 2024, 9:01 IST
- CEO Mukesh Kumar Meena : ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. పక్కాగా ఎన్నికల కోడ్ అమలు చేయాలని ఆదేశించారు.
సీఈవో ముకేష్ కుమార్ మీనా
CEO Mukesh Kumar Meena : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను(General Elections 2024) ఎటువంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా స్వేచ్ఛగా, నిర్భయంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) తెలిపారు. గురువారం నెల్లూరు(Nellore) మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్సీ కె.ఆరీఫ్ హఫీజ్‌తో కలిసి సీఈవో ముకేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో ముకేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 18 నుంచి నామినేషన్ల(AP Elections Nominations) ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, ఫ్లయ్యింగ్ స్వ్కాడ్‌లు, వీఎస్‌టీలు, ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 18 తరువాత పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా మీనా చెప్పారు. పైస్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయంతం చేయాలని పిలుపునిచ్చారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు బాగుంది : సీఈవో
నెల్లూరు(Nellore) మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) పనితీరు బాగుందని మీనా అన్నారు. కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన సీఈవో పలు విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సి-విజిల్ ఫిర్యాదులు(C Vigil Complaints), సోషల్ మీడియా ఫిర్యాదులను ఎలా పరిష్కారం చేస్తున్నారు? కోడ్ ఉల్లంఘన (MCC Violation)పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారా? మొదలైన విషయాలను అడిగి తెలుసుకుని ఎలా పరిష్కరిస్తున్నారని ఆరా తీశారు. ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్, సి విజిల్(C Vigil), 1950 కాల్‌సెంటర్లకు వస్తున్న ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ప్రతిరోజూ వస్తున్న ఫిర్యాదులపై సంబంధిత రిటర్నింగ్ అధికారులకు తెలియజేయడం, పరిష్కరించడం బాగుందన్నారు. నగదు, మద్యం, ఇతర సామగ్రి అక్రమ తరలింపులపై నిఘాపెట్టాలన్నారు. సీజర్ల సంఖ్య పెంచాలన్నారు. ఏ చిన్న సందేహాం ఉన్నా నివృత్తి చేసుకోవాలని, ఎన్నికల అధికారులు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సీఈవో సూచించారు.
ఓటహక్కు వినియోగం అవగాహన మస్కట్ ను ఆవిష్కరించిన సీఈవో
ఓటు హక్కు(Right to Vote) ఆవశ్యకత, వినియోగం తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్ ను సీఈవో ముకేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) ఆవిష్కరించారు. ఓటుహక్కును వినియోగిద్దాం...ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, మే 13న ఓటు హక్కు(Polling Day) వినియోగించుకుందాం వంటి నినాదాలతో రూపొందించిన మస్కట్ అందరి దృష్టిని ఆకర్షించింది.