Lok Sabha Election Schedule 2024: లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
- 2024 Lok Sabha Election schedule live updates: 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Sat, 16 Mar 202410:54 AM IST
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఇదీ
సిక్కిం అసెంబ్లీ గడువు 2 జూన్ 2024న ముగియనుంది. మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనుంది. ఇక్కడ మొత్తం 147 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2 జూన్ 2024న ముగియనుంది. ఇక్కడ మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గడువు 11 జూన్ 2024న ముగియనుంది. ఇక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే సమాంతరంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు 18 ఏప్రిల్ 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది. పోలింగ్ మే 13, 2024న జరుగుతుంది. ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.
అరుణాచల్ ప్రదేశ్
20 మార్చి 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది.
19 ఏప్రిల్ 2024న ఎన్నికలు జరుగుతాయి.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు
20 మార్చి 2024న నోటిఫికేషన్ వెలువడుతుంది.
19 ఏప్రిల్ 2024న ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:42 AM IST
ఏ ఫేజ్‌లో ఎన్ని సీట్లకు ఎన్నికలు
ఫేజ్ 1 లో 109, ఫేజ్ 2లో 89, ఫేజ్ 3లో 94, ఫేజ్ 4 లో 96, ఫేజ్ 5లో 49, ఫేజ్ 6లో 57, ఫేజ్ 7లో 57 సీట్లు పోలింగ్ జరగనుంది.
Sat, 16 Mar 202410:40 AM IST
లోక్‌సభ ఎన్నికలు ఏడో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 7 మే 2024
నామినేషన్లకు చివరి తేదీ: 14 మే 2024
నామినేషన్ల పరిశీలన: 15 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 17 మే 2024
పోలింగ్ తేదీ: 1 జూన్ 2024
ఓట్ల లెక్కింపు:4 జూన్ 2024
పంజాబ్, ఒడిశా, బీహార్, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:39 AM IST
లోక్‌సభ ఎన్నికలు ఆరో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 29 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 6 మే 2024
నామినేషన్ల పరిశీలన: 7 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 9 మే 2024
పోలింగ్ తేదీ: 25 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
యూపీ, బీహార్, బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:36 AM IST
లోక్‌సభ ఎన్నికలు ఐదో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 26 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 3 మే 2024
నామినేషన్ల పరిశీలన: 4 మే 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 6 మే 2024
పోలింగ్ తేదీ: 20 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
జమ్మూకశ్మీర్, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:34 AM IST
లోక్‌సభ ఎన్నికలు నాలుగో విడత తేదీలు
ఎన్నికల నోటిఫికేషన్: 18 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 26 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 29 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 13 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:32 AM IST
లోక్‌సభ ఎన్నికలు మూడో విడత తేదీ
లోక్‌సభ ఎన్నికలు మూడో విడత: నోటిఫికేషన్: 12 ఏప్రిల్ 2024
నామినేషన్లకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 20 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 22 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 7 మే 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:30 AM IST
లోక్‌సభ ఎన్నికలు రెండో విడత తేదీలు
రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024
నామినేషన్లకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2024
నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్ 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 8 ఏప్రిల్ 2024
పోలింగ్ తేదీ: 26 ఏప్రిల్ 2024
ఓట్ల లెక్కింపు: జూన్ 4, 2024
రెండో విడతలో ఈశాన్య భారతం, తమిళనాడు, రాజస్తాన్, తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:27 AM IST
లోక్‌సభ ఎన్నికలు 2024 మొదటి విడత తేదీ
మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్: 28 మార్చి 2024
నామినేషన్లకు చివరి తేదీ: 2 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి 2024
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువు: 30 మార్చి 2024
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19, 2024
ఓట్ల లెక్కింపు: 4 జూన్ 2024
తొలి విడత ఎన్నికల్లో ఈశాన్య భారతం, తమిళనాడు, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
Sat, 16 Mar 202410:24 AM IST
ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించనున్నట్టు ఈసీఐ ప్రకటించింది. 2019లో కూడా ఏడు విడతల్లో నిర్వహించింది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉండనుందని తెలిపింది.
Sat, 16 Mar 202410:21 AM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వెలువడనున్నట్టు ఈసీఐ వెల్లడించింది.
Sat, 16 Mar 202410:17 AM IST
26 అసెంబ్లీలకు ఉప ఎన్నికలు
బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీఐ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే వీటికి ఎన్నికలు నిర్వహించనుంది.
Sat, 16 Mar 202410:13 AM IST
2100 మంది పరిశీలకులు
సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 2100 మంది ఎన్నికల పరిశీలకులు పనిచేస్తారని ఈసీ ప్రకటించింది.
Sat, 16 Mar 202410:11 AM IST
లోక్‌సభ ఎన్నికలు 2024 లైవ్: వృద్ధులు, వికలాంగులకు ఇంటి నుంచి ఓటింగ్ ఆప్షన్: సీఈసీ
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ లైవ్: లోక్ సభ ఎన్నికల్లో భాగస్వామ్యాన్ని నిర్ధారించే ప్రయత్నంలో, ఎన్నికల సంఘం 85 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు, అలాగే 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు ఇంటి నుంచి ఓటింగ్ సౌకర్యాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా అర్హులైన ఓటర్లకు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో వలంటీర్లు, వీల్ చైర్లు, రవాణా సౌకర్యాలు కల్పించనున్నారు.
Sat, 16 Mar 202410:10 AM IST
లోక్ సభ ఎన్నికలు 2024 తేదీ లైవ్: ధనబలంపై సీఈసీ రాజీవ్ కుమార్
అక్రమ నిధుల ప్రవాహాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమగ్ర సమీక్షలు నిర్వహించిందని, ఈఎస్‌ఎం పోర్టల్, ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం వంటి చర్యల వల్ల గత 11 ఎన్నికల్లో సీజ్‌లు గణనీయంగా పెరిగాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
Sat, 16 Mar 202409:56 AM IST
నాలుగు సవాళ్లపై అప్రమత్తత
కేంద్ర ఎన్నికల ముందు 4 ప్రధాన సవాళ్లు ఉన్నాయని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వివరించారు. మంద బలం, ధనబలం, తప్పుడు సమచారం, హింస వంటి నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వీటన్నింటిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Sat, 16 Mar 202409:51 AM IST
తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసిందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ ఓటర్లను కోరారు.
Sat, 16 Mar 202409:38 AM IST
17వ లోక్‌సభ గడువు జూన్ 16తో పూర్తి
17వ లోక్‌సభ గడువు 16 జూన్ 2024తో పూర్తికానుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు. గడిచిన రెండేళ్లుగా సార్వత్రిక ఎన్నికల కోసం విభిన్న అంశాల్లో కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు వివరించారు. 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు చెప్పారు. 1.5 కోట్ల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటారని వివరించారు.
Sat, 16 Mar 202409:35 AM IST
ప్రారంభమైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ ప్రారంభమైంది. మరికొన్ని క్షణాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనుంది.
Sat, 16 Mar 202409:12 AM IST
షెడ్యూల్ తో పాటే.. అమల్లోకి ఎన్నికల కోడ్
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నిబంధనావళి చివరి విడత ఎన్నికలు ముగిసేవరకు అమల్లోకి ఉంటుంది. ఎన్నికల కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Sat, 16 Mar 202408:03 AM IST
ఎన్నికలే.. ఎన్నికలు..
2024లో దేశంలో రాజకీయాలు చాలా కీలంగా ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్- మే నెల్లో లోక్‌సభతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కొంత గ్యాప్ తర్వాత.. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లలో 2024 సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
Sat, 16 Mar 202407:57 AM IST
అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు
ఇక్కడ మొత్తం 57 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్ 31గా ఉంది. బీజేపీకి చెందిన ప్రేమ ఖండు.. ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు.
Sat, 16 Mar 202407:39 AM IST
సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు..
ఈశాన్య భారత రాష్ట్రమైన సిక్కింలో మొత్తం 32 సీట్లు ఉన్నాయి. మెజారిటీ ఫిగర్ 17గా ఉంది. ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా)కు చెందిన ప్రేమ్ సింగ్ తమంగ్ ఇక్కడ సీఎంగా ఉన్నారు.
Sat, 16 Mar 202407:24 AM IST
ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు..
ఒడిశాలో మొత్తం 147 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 74 స్థానాల్లో గెలవాలి. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్.. సుదీర్ఘ కాలంగా ఇక్కడ సీఎంగా కొనసాగుతున్నారు.
Sat, 16 Mar 202407:17 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మెజారిటీ ఫిగర్ 88ని దాటాలి. జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది
Sat, 16 Mar 202407:00 AM IST
లోక్‌సభ సీట్లు..
లోక్‌సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ నుంచి మే మధ్య వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి.
Sat, 16 Mar 202406:55 AM IST
మోదీ వర్సెస్ ఇండియా కూటమి..
2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. హ్యాట్రిక్ సాధించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ భావిస్తోంది. మోదీని ఢీకొట్టి, ఆయన్ని గద్దెదించేందుకు.. విపక్ష ఇండియా కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ దఫా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి.
Sat, 16 Mar 202406:49 AM IST
3 గంటలకు ప్రెస్ మీట్..
ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీటింగ్‌ని నిర్వహిస్తుంది ఈసీ.
Sat, 16 Mar 202406:49 AM IST
4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ కూడా..
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం
Sat, 16 Mar 202406:46 AM IST
మధ్యాహ్నం 3 గంటలకు..
యావత్ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి కీలక అప్డేట్ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
టాపిక్