తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mudragada Vs Daughter: ముద్రగడ పద్మనాభంపై కుమార్తె క్రాంతి విమర‌్శలు, కూతురు మాటలపై స్పందించనన్న ముద్రగడ

Mudragada Vs Daughter: ముద్రగడ పద్మనాభంపై కుమార్తె క్రాంతి విమర‌్శలు, కూతురు మాటలపై స్పందించనన్న ముద్రగడ

Sarath chandra.B HT Telugu

03 May 2024, 12:19 IST

google News
    • Mudragada Vs Daughter: ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై ఆయన కుమార్తె క్రాంతి విమర్శలు గుప్పించారు. పవన్‌ కళ్యాణ్‌ను తిట్టడానికి ముద్రగడను వాడుతున్నారని ఆరోపించారు. 
ముద్రగడ వ్యా‌ఖ్యలకు కుమార్తె క్రాంతి కౌంటర్
ముద్రగడ వ్యా‌ఖ్యలకు కుమార్తె క్రాంతి కౌంటర్

ముద్రగడ వ్యా‌ఖ్యలకు కుమార్తె క్రాంతి కౌంటర్

Mudragada Vs Daughter: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యవహారశైలిని ఆయన కుమార్త క్రాంతి తప్పు పట్టారు. పవన్‌ కళ్యాణ్‌‌ను ఓడిస్తానని ముద్రగడ సవాలు చేసిన నేపథ్యంలో క్రాంతి వీడియో విడుదల చేశారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి ఎన్ని చేయాలో చేస్తున్నారని, వంగా గీతను గెలిపించుకోడానికి ప్రచారం చేయడంలో తప్పు లేదని, ఈ క్రమంలో ముద్రగడ బాధాకరమైన సవాళ్లు చేస్తున్నారని ఆరోపించారు.

పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ చెప్పడంపై క్రాంతి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. పవన్‌ కళ్యాణ్‌ను పిఠాపురంలో తన్ని తరిమేస్తానని, పవన్‌ గెలిస్తే పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పడంపై ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదన్నారు.

పవన్ కళ్యాణ్‌ను కించపరిచేలా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యాలు చేయడం తగదన్నారు. పవన్ ‌ను ఓడించడం కోసమే జగన్‌ ముద్రగడను వాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత ముద్రగడను ఎటూ కాకుండా వదిలేస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తనవంతు ప్రయత్నం తాను చేస్తానని, ఆయన తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ…

కుమార్తె క్రాంతి వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కూతురికి పెళ్లై పోయిందని, పెళ్లి కాకముందు వరకే ఆమె తన ప్రాపర్టీ అని, ఇప్పుడు ఆమె మెట్టినింటి ప్రాపర్టీ అవుతుందన్నారు.

తనను కుమార్తెతో కొంతమందితో తిట్టించారని, ఇది బాధాకరమన్నారు. రాజకీయం రాజకీయమే, కూతురు కూతురేనన్నారు. తాను ఒకసారి వైఎస్ఆర్సీపీ లో చేరానని, ఇక పక్క చూపులు చూడనన్నారు. ఎవరెన్ని అనుకున్న సీఎం జగన్ మళ్ళీ సీఎం కావడం ఖాయమని, పదవుల కోసం పాకులాడనని చెప్పారు. ఆ పార్టీలో పదవులు కూడా అడగనన్నారు. తాను సేవకుడిని మాత్రమేనన్నారు.

తదుపరి వ్యాసం