తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mudragada In Ycp: సిఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. కుమారుడితో కలిసి వైసీపీలో చేరిక

Mudragada In YCP: సిఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం.. కుమారుడితో కలిసి వైసీపీలో చేరిక

Sarath chandra.B HT Telugu

27 March 2024, 11:29 IST

google News
    • Mudragada In YCP: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ముద్రగడకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
కుమారుడితో కలిసి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం
కుమారుడితో కలిసి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

కుమారుడితో కలిసి వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

Mudragada In YCP: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. సిఎం జగన్ సమక్షంలో కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ రాజకీయ పయనంపై గత కొద్ది నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలికారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై సందిగ్ధత కొద్ది రోజుల క్రితమే వీడింది. రెండ్రోజుల క్రితమే ముద్రగడ వైసీపీలో చేరాల్సి ఉన్నా సిఎం పర్యటనల నేపథ్యంలో వాయిదా పడింది.

ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నామని ముద్రగడ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీ చేయడంపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదని ప్రకటించారు. వైసీపీలో ఎలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే లక్ష్యమని ప్రకటించారు. వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ముద్రగడ ప్రకటించారు.

"సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీలో చేరినట్టు ముద్రగడ  Padmanabhamస్పష్టం చేశారు. వైసీపీ నేతలు పార్టీలోకి రావాలని చర్చలు జరిపారని ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

ఎన్నికల్లో పోటీపై ఎలాంటి కండిషన్ లేకుండానే పార్టీలో చేరుతున్నట్లు Mudragada వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇస్తే తీసుకోవటానికి సుముఖంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదని, తన కుమారుడు కూడా పోటీ చేయడని, సిఎం జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. వైసీపీ YSRCPఅధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

ఫలించిన వైసీపీ ఆపరేషన్

కొద్ది వారాల క్రితం ముద్రగడ పద్మనాభం జనసేనలో Janasenaకి వెళ్తారని ప్రచారం జరిగింది. ముద్రగడతో చర్చలు జరిపేందుకు పవన్ కళ్యాణ‌ ఆయన ఇంటికి వస్తారని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ పవన్ కళ్యాణ్‌ రాకపోవడం, టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగిపోయాయి.

టీడీపీ జాబితా విడుదలైన తర్వాత ముద్రగడ మరో లేఖను విడుదల చేశారు. 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు తమ అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు, గణేష్‌ ముద్రగడతో చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా కో ఆర్డినేటర్ మిథున్‌ రెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత స్వయంగా మిథున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి… ముద్రగడ నివాసానికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

మాజీ మంత్రిగా, కాపు నాయకుడిగా గుర్తింపు..

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభయం ఎమ్మల్యేగా గెలిచారు.

1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.

1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.

ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఓరకంగా ముద్రగడను పార్టీలోకి రప్పించే విషయంలో వైసీపీ ఆపరేషన్ సక్సెస్ అయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం