తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Elections Notification : ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్, నామినేషన్లకు సర్వం సిద్ధం!

AP Elections Notification : ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్, నామినేషన్లకు సర్వం సిద్ధం!

17 April 2024, 18:35 IST

    • AP Elections Notification : ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరానికి రేపు(ఏప్రిల్ 18) నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది.
ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్
ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్

ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్

AP Elections Notification : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి రేపు తొలి అడుగు పడబోతుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ నోటిఫికేషన్(AP Elections Notification) విడుదల కానుంది. రేపు(ఏప్రిల్ 18న) ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేయనుంది. ఇక నుంచి అభ్యర్థులు అసలైన ఎన్నికల సమరంలోకి అడుగు పెట్టనున్నారు. రేపటి నుంచే నామినేషన్ల (AP Elections Nominations)ప్రక్రియ మొదలు కానుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం(ఉపఎన్నిక), 17 లోక్ సభ స్థానాలకు రేపు నోటిఫికేషన్ రానుంది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

ఏపీ ఎన్నికల నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో గురువారం(ఏప్రిల్ 18) సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌(AP Election Notification) జారీ కానుంది. రేపట్నుంచి ఈ నెల 25 వరకు అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల నామినేషన్లు(AP Assembly Nominations) స్వీకరించనున్నారు. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఇస్తారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఒకేసారి పోలింగ్‌(AP Polling Date) నిర్వహించనున్నారు. జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు(AP Elections Counting) చేపట్టనున్నారు. అయితే నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు

నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు(Fourth Phase Elections Nomination) నామినేషన్ల ప్రక్రియ రేపట్నుంచి మొదలుకానుంది. నాలుగో విడతలో ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు(Lok Sabha Elections 2024) జరుగనున్నాయి. ఈ 96 ఎంపీ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 29 వరకు గడవు ఇచ్చారు. రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలను నిలిపివేయనున్నారు. జూన్ 1 వరకు ఎలాంటి సర్వేలు ప్రచురించకూడదు. దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్‌ 1న ఎగ్జిట్‌ పోల్స్(Exit Polls 2024) వెల్లడించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.

ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్(First Phase Polling)

2024 సార్వత్రిక ఎన్నికల(General Election 2024) సమరం మొదలైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్‌(Lok Sabha Elections Phase-I)కు సంబంధిన ప్రచారం నేటితో ముగిసింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి రాజకీయ పార్టీలు ప్రచారంతో చేయకూడదు. ఏప్రిల్ 19న జరిగే తొలిదశ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్‌ 12, ఉత్తర్‌ప్రదేశ్‌ 8, మధ్యప్రదేశ్‌ 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ , అసోంలో 5 స్థానాలకు, బిహార్‌లో 4 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయా, మణిపుర్‌ లో 2 , మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, సిక్కిం, నాగాలాండ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ లో ఒక లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

తదుపరి వ్యాసం