తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress Candidates : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

AP Congress Candidates : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

09 April 2024, 22:31 IST

google News
    • AP Congress Candidates : ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించింది. 12 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

ఏపీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

AP Congress Candidates : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను(AP Congress Second List) మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇటీవల 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 12 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఈ అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజా ప్రకటనతో ఇప్పటి వరకూ 126 అసెంబ్లీ, 11 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులు(Congress Lok Sabha Candidates)

  1. విశాఖపట్నం-పులుసు సత్యనారాయణ రెడ్డి
  2. అనకాపల్లె-వేగి వెంకటేశ్
  3. ఏలూరు-కావూరి లావణ్య
  4. నరసరావుపేట-గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్
  5. నెల్లూరు-కొప్పుల రాజు
  6. తిరుపతి(ఎస్సీ)-డా.చింతా మోహన్

12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు (Congress Assembly Candidates)

  1. టెక్కలి-కిల్లి కృపారాణి
  2. భీమిలి-అడ్డాల వెంకట వర్మ రాజు
  3. విశాఖ సౌత్-వాసుపల్లి సంతోష్
  4. గాజువాక-లక్కరాజు రామారావు
  5. అరకు లోయ(ఎస్టీ)-శెట్టి గంగాధరస్వామి
  6. నర్సీపట్నం-రుతాల శ్రీరామమూర్తి
  7. గోపాలపురం(ఎస్సీ)-సోడదాసి మార్టిన్ లుథర్
  8. ఎర్రగొండపాలెం(ఎస్సీ)-డా.బుద్ధాల అజితరావు
  9. పర్చూరు-నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
  10. సంతనూతలపాడు(ఎస్సీ)-విజేశ్ రాజ్ పాలపర్తి
  11. గంగాధర నెల్లూరు(ఎస్సీ)-డి.రమేశ్ బాబు
  12. పూతపపట్టు(ఎస్సీ)-ఎం.ఎస్.బాబు

సీపీఐ, సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు

ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలతో (Communists) కాంగ్రెస్ (Congress) పార్టీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే సీపీఐతో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా సీపీఎం(CPM)తో కూడా ఆ పార్టీ అవగాహనకు వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో సీట్ల సర్దుబాటుకు విముఖత చూపిన సీపీఎం నష్టపోయింది. ఒక్క స్థానంతో సర్దుకు పోయేందుకు అంగీకరించిన సీపీఐ అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఏపీలో కూడా సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. ఒక పార్లమెంటు స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలను సీపీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. తాజగా సీపీఎంతో కూడా అవగాహన కుదిరింది.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఒక లోక్‌సభతో పాటు, పది శాసనసభ స్థానాలకు సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తారు. కాంగ్రెస్‌ పార్టీతో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు లోక్‌సభ, రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు పట్టణం శాసనసభ స్థానాలపై పరస్పర అంగీకారం కుదరగా.. మిగతా అయిదు స్థానాలపై స్పష్టత రాలేదు. సీపీఎం మాత్రం మొత్తం పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొలిక్కిరాని అయిదు స్థానాలపై నామినేషన్‌ దాఖలు గడువు ముగిసేలోగా ఇరు పార్టీలు ఒక అవగాహనకు రానున్నట్లు సీపీఎం పేర్కొంది.

తదుపరి వ్యాసం