AP BJP Candidates List : ఏపీ అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు, లిస్ట్ ఇదే!
AP BJP Candidates List : ఏపీ బీజేపీ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా వచ్చిన 10 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.
AP BJP Candidates List : బీజేపీ అధిష్టానం ఏపీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను(AP BJP Assembly Candidates List) ప్రకటించింది. టీడీపీ, జనసేనతో పొత్తుల్లో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. ఇప్పటికే లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ... బుధవారం సాయంత్రం అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది.
ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా(AP BJP Candidates List)
- ఎచ్చెర్ల-ఎన్.ఈశ్వర్‌రావు
- విశాఖ నార్త్-పి.విష్ణుకుమార్ రాజు
- అరకు లోయ(ST)-పంగి రాజారావు
- అనపర్తి-ఎం.శివకృష్ణం రాజు
- కైకలూరు-కామినేని శ్రీనివాసరావు
- విజయవాడ వెస్ట్-సుజనా చౌదరి
- బద్వేల్(ST)-బొజ్జ రోషన్న
- జమ్మలమడుగు-సి.ఆదినారాయణరెడ్డి
- ఆదోని-పీవీ పార్థసారథి
- ధర్మవరం-వై.సత్యకుమార్
మరో సీటు కోరుతున్న బీజేపీ
కూటమి పొత్తుల్లో 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ(BJP) అంగీకరించిన విషయం తెలిసిందే. కానీ స్థానిక నేతల ఒత్తిళ్లతో మరో సీటు కోసం బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) అసెంబ్లీ బరిలో(Assembly election) నిలవాలని భావిస్తున్నారు. ఆయన కోసం మరో అసెంబ్లీ సీటు కోసం బీజేపీ కూటమి పార్టీలతో చర్చిస్తోంది. ఇప్పటికే జనసేన మూడు సీట్లు వదులకుంది. టీడీపీ, జనసేన చర్చల్లో ముందు పవన్ పార్టీకి 24 సీట్లు కేటాయించారు. కానీ బీజేపీతో పొత్తు కుదిరింది. దీంతో జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు త్యాగం చేసింది. టీడీపీ(TDP) సైతం ఒక అసెంబ్లీ స్థానం వదులుకుంది.
రాజమండ్రి రూరల్ స్థానం బీజేపీకేనా?
రాజమహేంద్రవరం రూరల్ (Rajahmundry Rural)నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)బరిలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ కూటమి పక్షాన టీడీపీ, బీజేపీకి సీటును విడిచిపెట్టడానికి అంగీకరించిందని సమాచారం. ఇక్కడ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ ప్రకటించింది. కానీ ఆయన ఈ స్థానాన్ని బీజేపీ కోసం వదులుకుంటారా? అనే తెలియాల్సి ఉంది.
విజయవాడ వెస్ట్ సీటు బీజేపీదే
అలాగే రాజ్యసభ మాజీ ఎంపీ సుజనా చౌదరికి బీజేపీ విజయవాడ వెస్ట్ సీటు(Vijayawada West) కేటాయించింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం జనసేన (Janasena)పట్టుబట్టింది. ఇక్కడి నుంచి జనసేన నేత పోతిన మహేశ్ టికెట్ ఆశించారు. సీట్ల పంపకాల్లో ఆయనకు సీటు దక్కలేదు. అయితే పోతిన మహేష్(Pothina Mahesh) విజయవాడ పశ్చిమ సీటు కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవేల జనసేన సీటు కేటాయించకపోతే పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫొటోతో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
ఏపీ లోక్‌సభ అభ్యర్థులు(BJP Lok Sabha Candidates)
- అరకు(ఎస్టీ- కొత్తపల్లి గీత
- అనకాపల్లి - సీఎం రమేష్
- రాజమండ్రి- పురందేశ్వరి
- నర్సాపురం- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- తిరుపతి (ఎస్సీ) - వరప్రసాదరావు
- రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
సంబంధిత కథనం