AP TS BJP Candidates List : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితాను(BJP Fifth List) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 111 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయింది. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో(AP BJP Candidates) పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో 6 ఎంపీ అభ్యర్థులను బీజేపీ ఐదో జాబితాలో ప్రకటించింది. అయితే నర్సాపురం టికెట్ ఆశించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. నర్సాపురం టికెట్ ను భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ(TS BJP Candidates) తాజాగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ (ఎస్సీ) స్థానానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ కు, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావును సీటు కేటాయించింది.
ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలకు సోమవారం(మార్చి 25న) బీజేపీ అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు.
బీజేపీ గత జాబితాలో తెలంగాణ నుంచి 15 మంది అభ్యర్థులను(TS BJP Candidates) ఖరారు చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ ఐదో జాబితా(BJP Fifth List)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు బిహార్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, ఒడిశా, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి మొత్తం 111 అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 402 మంది లోక్ సభ అభ్యర్థులని(BJP Lok Sabha Candidates) బీజేపీ ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది, ఐదో జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.
సంబంధిత కథనం