Team India: టీమిండియా చరిత్రలో వరస్ట్ డెబ్యూ రికార్డ్ ఈ క్రికెటర్‌దే - 179 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేదు
29 August 2024, 10:41 IST
Team India: టీమిండియా క్రికెట్ చరిత్రలో వరస్ట్ డెబ్యూ క్రికెటర్‌గా పంకజ్ సింగ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా తరఫున రెండు, టెస్ట్‌లు, ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు పంకజ్ సింగ్. అతడు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలవ్వడం గమనార్హం.
పంకజ్ సింగ్
Team India: డెబ్యూ మ్యాచ్ ప్రతి ఒక్క క్రికెటర్ కెరీర్‌లో స్పెషల్‌గా ఉంటుంది. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టి తమ కెరీర్‌లో మరచిపోలేని జ్ఞాపకంగా దానిని మిగిల్చుకోవాలని ప్రతి క్రికెటర్ కలలు కంటుంటాడు. మొదటి మ్యాచ్‌లో తమ టాలెంట్‌ను చూపించాలని తహతహలాడుతుంటాడు. కొందరికి తొలి మ్యాచ్ తీపి జ్ఞాపకమైతే...మరికొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది.
472 వికెట్లు...
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 472 వికెట్లు తీసి రికార్డ్ నెలకొల్పిన పంకజ్ సింగ్‌కు టీమిండియా తరఫున కేవలం రెండు టెస్ట్‌లు, ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2014లో దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి అనూహ్యంగా టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు పంకజ్ సింగ్. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పంకజ్ సింగ్‌కు చోటిచ్చారు సెలెక్టర్లు.
47 ఓ వర్లు వేసి...
ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌లు ఆడిన పంకజ్ సింగ్...రెండింటిలో దారుణంగా నిరాశపరిచాడు. మొదటి టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు...రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు...మొత్తంగా 47 ఓవర్లు వేసిన పంకజ్ సింగ్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు.ఈ టెస్ట్‌లో పంకజ్ సింగ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 179 పరుగులు ఇచ్చాడు. అరంగేట్రం టెస్ట్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పేసర్‌గా చెత్త రికార్డును క్రియేట్ చేశాడు.
69వ ఓవర్ లో ఫస్ట్ వికెట్…
తన పేస్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయాడు.అరంగేట్రం టెస్ట్‌లో విఫలమైనా...కూడా ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో పంకజ్ సింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ కొనసాగించింది. రెండో టెస్ట్‌లో కాస్త పర్వాలేదనిపించాడు. రెండు వికెట్లు తీశాడు. మొత్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తాను వేసిన 69వ ఓవర్‌లో ఫస్ట్ వికెట్‌ను పంకజ్ సింగ్ తీసుకున్నాడు. తొలి వికెట్ కోసం అత్యధిక ఓవర్లు వేసిన టీమిండియా బౌలర్‌గా చెత్త రికార్డును పంకజ్ సింగ్ మూటగట్టుకున్నాడు.
ఒకే ఒక్క వన్డే మ్యాచ్...
పంకజ్ సింగ్ ఆడిన రెండు టెస్టుల్లో టీమిండియా దారుణంగా పరాజయం పాలైంది. రెండు టెస్ట్‌లో ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవ్వడంతో పంకజ్ సింగ్‌కు టెస్టుల్లో మళ్లీ అవకాశం రాలేదు.
టీమిండియా తరఫున ఒకే ఒక వన్డే మ్యాచ్‌లో పంకజ్ సింగ్‌కు అవకాశం దక్కింది. 2010లో శ్రీలంకతోజరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో దారుణంగా నిరాశపరిచాడు. ఏడు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చిన పంకజ్ సింగ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో పంకజ్ సింగ్ మళ్లీ టీమిండియాలో కనిపించలేదు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడాడు పంకజ్ సింగ్.