IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా విక్టరీ - అశ్విన్ దెబ్బకు ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ చిత్తు
IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అశ్విన్ దెబ్బకు సెకండ్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్నది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్నది.
IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకున్నది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్, బౌలింగ్‌లో అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ విలవిలలాడింది.
259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అశ్విన్ దెబ్బకు 195 రన్స్‌కు ఆలౌటైంది. రూట్ మినహా అశ్విన్ స్పిన్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా యాభై బాల్స్ కూడా ఆడలేకపోయారు. రూట్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
వంద పరుగులకే ఐదు వికెట్లు...
అశ్విన్ స్పిన్ మాయజాలంతో ఇంగ్లండ్ వంద పరుగులకే ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. వందో టెస్ట్ ఆడుతోన్న బెయిర్ స్టో కాసేపు ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. అతడి జోరుకు కుల్దీప్ బ్రేకులు వేశాడు. టెయిలెండర్ల పని బుమ్రా పట్టాడు. ఓవైపు వికెట్లు పడుతోన్న రూట్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. పట్టుదలతో ఆడిన అతడు హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.
టామ్ హార్టీతో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. హార్టీ, మార్క్‌వుడ్‌ను ఒకే ఓవర్‌లో బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. క్రీజులో పాతుకుపోయిన రూట్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఐదు, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 477 రన్స్...
తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 477 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, 103 రన్స్, శుభ్‌మన్ గిల్ 110 పరుగులతో అదరగొట్టారు. యశస్వి జైస్వాల్ (57 రన్స్), సర్ఫరాజ్ ఖాన్ (56 రన్స్),మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా...అరంగేట్రం ప్లేయర్ దేవదత్ పడిక్కల్ 65 పరుగులతో సత్తా చాటాడు. కెరీర్‌లో వందో టెస్ట్ ఆడుతోన్న అశ్విన్ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో కుంబ్లేను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైంది.
టీమిండియా ఫస్ట్ ప్లేస్...
ఈ విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో ఇండియా మొదటి స్థానానికి చేరుకున్నది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యశస్వి జైస్వాల్‌కు దక్కింది. ఈ సిరీస్‌లు ఏడు వందల రన్స్ చేశాడు జైస్వాల్. గవాస్కర్ తర్వాత ఓ టెస్ట్ సిరీస్‌లో ఏడు వందల పరుగులు చేసిన సెకండ్ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలిచింది. మిగిలిన నాలుగు టెస్టుల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్లు లేకపోయినా యంగ్ ప్లేయర్ల స్ఫూర్తిదాయక ఆటతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.