తెలుగు న్యూస్  /  క్రికెట్  /  World Cup Final Pitch: వరల్డ్ కప్ ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇదీ

World Cup final pitch: వరల్డ్ కప్ ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇదీ

Hari Prasad S HT Telugu

08 December 2023, 12:18 IST

    • World Cup final pitch: టీమిండియా కొంప ముంచిన వరల్డ్ కప్ 2023 ఫైనల్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ లోస్కోరింగ్ ఫైనల్లో ఇండియా 6 వికెట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ కు యావరేజ్ రేటింగ్
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ కు యావరేజ్ రేటింగ్ (REUTERS)

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ పిచ్ కు యావరేజ్ రేటింగ్

World Cup final pitch: వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. నెమ్మదిగా ఉన్న ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడానికి ఇండియన్ బ్యాటర్లు తంటాలు పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ లో స్కోరింగ్ మ్యాచ్ లో 6 వికెట్లతో రోహిత్ సేన ఓడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు

RR vs KKR: రాజస్థాన్, కోల్‍కతా మ్యాచ్‍ వర్షార్పణం.. హైదరాబాద్‍కు జాక్‍పాట్.. రెండో ప్లేస్‍ దక్కించుకున్న సన్‍రైజర్స్

SRH vs PBKS: ఉప్పల్‍లో దుమ్మురేపిన సన్‍రైజర్స్ హైదరాబాద్.. అదరగొట్టిన అభిషేక్.. పంజాబ్‍పై సూపర్ గెలుపు

Virat Kohli IPL : ‘విరాట్​ కోహ్లీ ఆడినా ఆర్సీబీ ఓడిపోతుంది’!

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

241 రన్స్ లక్ష్యాన్ని 43 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా చేజ్ చేసింది. మ్యాచ్ తర్వాత పిచ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ పిచ్ కు ఐసీసీ ఎలాంటి రేటింగ్ ఇస్తుందో అని అందరూ ఎదురు చూశారు. తాజాగా వస్తున్న రిపోర్టు ప్రకారం ఐసీసీ ఈ పిచ్ కు యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. ఇక రెండు సెమీఫైనల్ మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు కూడా రేటింగ్స్ ఇచ్చారు.

ఇండియా, న్యూజిలాండ్ మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ ఇచ్చారు. ఆ మ్యాచ్ కు జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు. వరల్డ్ కప్ 2023లో ఇండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ ల పిచ్ లకు యావరేజ్ రేటింగ్ వచ్చింది. ఫైనల్ కాకుండా లీగ్ స్టేజ్ లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాలతో ఆడిన కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్, చెన్నై పిచ్ లు సగటు రేటింగ్ ను సంపాదించుకున్నాయి.

అహ్మదాబాద్ లో ఫైనల్ కు వాడిన పిచ్ పై భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి. ఇండియా ప్లాన్ బెడసికొట్టిందని ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇక హెడ్ కోచ్ ద్రవిడ్ కూడా పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము అనుకున్నంత టర్న్ పిచ్ లో లేదని ఫైనల్ తర్వాత బీసీసీఐ అధికారులతో ద్రవిడ్ చెప్పినట్లు తెలిసింది.

తదుపరి వ్యాసం