Steve Smith Retirement: స్టీవ్ స్మిత్ రిటైర్‌మెంట్ - క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌-steve smith gives clarity on his test cricket retirement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Steve Smith Retirement: స్టీవ్ స్మిత్ రిటైర్‌మెంట్ - క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌

Steve Smith Retirement: స్టీవ్ స్మిత్ రిటైర్‌మెంట్ - క్లారిటీ ఇచ్చిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 07, 2023 09:29 AM IST

Steve Smith Retirement: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు స్మిత్ క్లారిటీ ఇచ్చాడు. తాను టెస్ట్‌ల‌కు దూర‌మ‌వుతున్న‌ట్లు ఎవ‌రితో ఎప్పుడు చెప్ప‌లేద‌ని అన్నాడు.

 స్టీవ్ స్మిత్
స్టీవ్ స్మిత్

Steve Smith Retirement: ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు గ‌త కొన్నాళ్లుగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ సంద‌ర్భంగా మైఖేల్ వాన్ ద్వారా స్మిత్ రిటైర్‌మెంట్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. స్మిత్ రిటైర్‌మెంట్ కావ‌డం నిజ‌మేనంటూ క్రికెట్ వ‌ర్గాలు చెబుతూ వ‌చ్చాయి.

పాకిస్థాన్‌తో జ‌న‌వ‌రిలో జ‌రుగ‌నున్న టెస్ట్ సిరీస్ త‌ర్వాత డేవిడ్ వార్న‌ర్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అత‌డి బాట‌లోనే స్మిత్ అడుగులు వేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై స్మిత్ క్లారిటీ ఇచ్చాడు. రిటైర్‌మెంట్ వార్త‌ల‌ను ఖండించాడు. తాను టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఎవ‌రితో చెప్ప‌లేద‌ని అన్నాడు.

ఈ న్యూస్ ఎక్కడ నుంచి వచ్చిందో…. ఎలా వ‌చ్చిందో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌ట్లో టెస్ట్ క్రికెట్‌కు తాను దూరం కావాల‌ని అనుకోవ‌డం లేద‌ని, మ‌రి కొన్నాళ్లు ఈ ఫార్మెట్‌ను ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో స్మిత్ 302 ర‌న్స్‌తో రాణించాడు. కీల‌క‌మైన మ్యాచ్‌ల‌లో స్మిత్ విఫ‌ల‌మైన ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డంతో అత‌డిపై విమ‌ర్శ‌లు పెద్ద‌గా రాలేదు.

IPL_Entry_Point