Transgender Cricketers:ట్రాన్స్‌జెండర్ క్రికెటర్స్‌పై ఐసీసీ నిషేధం - రిటైర్‌మెంట్ ప్రకటించిన కెనడా క్రికెటర్
Transgender Cricketers: పురుషుల నుంచి మహిళలుగా మారిన ట్రాన్స్‌జెండర్ క్రికెటర్స్‌పై ఐసీసీ నిషేధం విధించింది. మహిళ క్రికెటర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
Transgender Cricketers: ఉమెన్స్ క్రికెట్‌లో ఇకపై ట్రాన్స్‌జెండర్స్ కనిపించరు. పురుషులుగా జన్మించి ఆ తర్వాత లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారి ఉమెన్స్ క్రికెట్ ఆడేవారిపై ఐసీసీ నిషేధం విధించింది. ప్లేయర్ల భద్రతతో పాటు మహిళ క్రికెట్ విలువల్ని, సమగ్రతను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
మహిళా క్రికెటర్లతో పాటు చాలా క్రికెట్ నిపుణులను సంప్రదించిన తర్వాతే జెండర్ ఎలిజిబిలిటీ రెగ్యులేషన్స్‌లో మార్పులు చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐర్లాండ్‌కు చెందిన డేనియల్ మెక్ గేహే ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ గా నిలిచాడు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో కెనడా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు మెక్ గేహే. కెనడా తరఫున ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐసీసీ నిషేధం నేపథ్యంలో మెక్‌గేహె క్రికెట్ ఆడటానికి అనర్హుడిగా మారాడు.ఐసీసీ నిర్ణయంతో మెక్‌గేహె రిటైర్‌మెంట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రిటైర్‌మెంట్ ప్రకటించాడు