Gautam Gambhir: ఒకప్పుడు ఈ ఐదుగురు క్రికెటర్లకు టీమ్‌మేట్ - ఇప్పుడు వారికి కోచ్ - గౌతమ్ గంభీర్ రేర్ ఫీట్
11 July 2024, 15:07 IST
Gautam Gambhir: ప్రస్తుతం టీమిండియా లోని ఐదుగురు క్రికెటర్లకు టీమ్‌మేట్‌గా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు వారికి కోచ్‌గా మారాడు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
గౌతమ్ గంభీర్
Gautam Gambhir: టీమ్‌మేట్‌గా తమతో కలిసి ఆడిన క్రికెటర్...ఆ జట్టు సభ్యులకే కోచ్‌గా మారడం అన్నది అరుదుగా జరుగుతుంది. గౌతమ్ గంభీర్ కెరీర్‌లో ఆ అరుదైన సంఘటన చోటుచేసుకోనున్నది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను అపాయింట్ చేస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. టీ20 వరల్డ్ కప్‌తో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో అతడి స్థానాన్ని గంభీర్‌తో బీసీసీఐ భర్తీ చేసింది.
147 వన్డేలు, 58 టెస్ట్‌లు...
టీమిండియా తరఫున 147 వన్డేలు, 58 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు గంభీర్. క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. గంభీర్ మార్గదర్శకత్వంలోనే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను కోల్‌కతా సొంతం చేసుకున్నది. శ్రీలంక టూర్ నుంచి టీమిండియా కోచ్‌గా గంభీర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
రిటైర్‌మెంట్‌కు ముందు...
ప్రస్తుతం టీమిండియాలోని కొందరి ఆటగాళ్లకు గంభీర్ రిటైర్‌మెంట్‌కు ముందు టీమ్‌మేట్‌గా కొనసాగాడు. వారితో కలిసి టీమిండియా తరఫున పలు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు వారికే కోచ్‌గా గంభీర్ రాబోతుండటం గమనార్హం.
2011 వరల్డ్ కప్....
గౌతమ్ గంభీర్, కోహ్లి కలిసి 2011 వరల్డ్ కప్ ఆడారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించారు. ఈ ఫైనల్‌లో గంభీర్ 97 పరుగులతో రాణించాడు అంతే కాదు తన కెరీర్‌లో చివరి టెస్ట్‌ను కోహ్లి కెప్టెన్సీలోనే ఆడాడు గంభీర్. ఇప్పుడు కోహ్లికి కోచ్‌గా గంభీర్ మారాడు.
2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్...
రోహిత్ శర్మ, గంభీర్ కలిసి 2007 టీ20 వరల్డ్ ఆడారు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గంభీర్, రోహిత్ బ్యాట్‌తో చేలరేగి టీమిండియాకు కప్ అందించారు. ఫైనల్‌లో గంభీర్ 75 పరుగులు చేయగా...రోహిత్ శర్మ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా పలు మూడు ఫార్మెట్స్‌లో గంభీర్, రోహిత్ టీమ్‌మేట్స్‌గా పలు టోర్నీలలో కనిపించారు.
అశ్విన్, జడేజా...
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పేసర్ మహ్మద్ షమీలకు టీమ్‌మేట్‌గా గంభీర్ వ్యవహరించాడు. వారితో కలిసి టీమిండియా తరఫున పలు మ్యాచ్‌లు ఆడాడు.
రెండేళ్లు పదవిలో...
ఒకప్పుడు ఈ ఐదుగురు క్రికెటర్లకు టీమ్‌మేట్‌గా ఉన్న గంభీర్ ఇప్పుడు వారికి కోచ్‌గా మారడం ఆసక్తికరంగా మారింది. టీమిండియా కోచ్‌గా ఈ పదవిలో రెండేళ్ల పాటు గంభీర్ కొనసాగనున్నాడు. 2026లో అతడి పదవీ కాలం ముగియనుంది.