Rohit Sharma: ఫైనల్లోకి టీమిండియా ఎంట్రీ తో రోహిత్ శర్మ కన్నీళ్లు - ఓదార్చిన కోహ్లి - వీడియో వైరల్
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించగానే కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని కోహ్లి ఓదార్చాడు. రోహిత్, కోహ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. శనివారం (జూన్ 29న) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. సెమీ ఫైనల్ పోరులో 57 పరుగులతో టీమిండియా విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక భూమిక పోషించాడు. నలభై పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి భారీ స్కోరు అందించాడు.
39 బాల్స్‌లో 57 రన్స్...
ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 రన్స్ చేశాడు. ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించగానే రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న రోహిత్ ఛైర్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడిని కోహ్లి ఓదార్చాడు. రోహిత్ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్, కోహ్లి వీడియోను పలువురు క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు షేర్ చేస్తోన్నారు.
248 రన్స్...
టీ20 వరల్డ్ కప్‌లో బ్యాట్‌తో రోహిత్ శర్మ అదరగొడుతోన్నాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోమూడో స్థానంలో రోహిత్ కొనసాగుతోన్నాడు. ఏడు మ్యాచుల్లో 41.33 యావరేజ్, 155.97 స్ట్రేక్ రేట్‌తో రోహిత్ శర్మ 248 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్‌లో ఆఫ్గానిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (281 రన్స్)తో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్...గుర్భాజ్ రికార్డును దాటేసే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లి మాత్రం టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌లోసిక్సు కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లే కోహ్లి కనిపించాడు. కానీ అదే ఓవర్‌లో అనవసరపు షాట్‌కు యత్నించి బోల్డ్ అయ్యాడు.
మూడోసారి...
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోకి టీమిండియా అడుగుపెట్టడం ఇది మూడోసారి. టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ ఎడిషన్‌లోనే టైటిల్ గెలుచుకొని టీమిండియా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని సాధించింది.
ఆ తర్వాతఏడేళ్లకు... 2014 టీ20 వరల్డ్ కప్‌ఫైనల్‌లో అడుగుపెట్టింది టీమిండియా. కానీ తుది పోరులో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. మళ్లీ పదేళ్లకు ఈ పొట్టి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బార్బడోస్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం వేదికగా టీమిండియా, సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.
మార్పులు లేకుండా...
ఫైనల్ పోరులో టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో ఆడిన జట్టు ఫైనల్‌లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ముగ్గురు స్పిన్నర్ల తో ఆడాలనే రోహిత్ ఆలోచన వర్కవుట్ కావడంతో ఫైనల్‌లోనే అదే ఫార్ములాను ఫాలో కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోన్నట్లు సమాచారం.