IPL 2024: ఈ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తోన్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు వీళ్లే - టీమిండియాలో చోటు దక్కేది ఎవరికో?
Ashutosh Sharma: ఐపీఎల్ 2024లో అనామక క్రికెటర్లుగా బరిలో దిగిన కొందరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అంచనాలకు మించి రాణిస్తూ అదరగొడుతోన్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
Ashutosh Sharma: ఈ ఏడాది ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. అనామక క్రికెటర్లుగా బరిలోకి దిగిన కొందరు ఆటగాళ్లు తమ బ్యాటింగ్, బౌలింగ్ మెరుపులతోప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటున్నారు. ఐపీఎల్ 2024తో హీరోలుగా మారిపోయారు. ఆ క్రికెటర్లు ఎవరంటే?
అశుతోష్ శర్మ...
అశుతోష్ శర్మ...మొన్నటివరకు క్రికెట్ అభిమానులకు ఇతడి పేరు పెద్దగా తెలియదు. ఈ సీజన్‌తోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అశుతోష్ శర్మ కేవలం నాలుగు మ్యాచ్‌లతోనే తానంటే ఏమిటో క్రికెట్ వరల్డ్‌కు చాటిచెప్పాడు. సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతోన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున బరిలో దిగిన అశుతోష్ శర్మ నాలుగు మ్యాచుల్లో 52 యావరేజ్‌తో 156 పరుగులు చేశాడు.
ముంబైపై అతడు ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌లోనే గ్రేట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజాబ్‌ను ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజయం వరకు తీసుకెళ్లాడు. 28 బాల్స్‌లో ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 61 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొమ్మిది పరుగులతో పంజాబ్ ఓడిపోయినా అశుతోష్ పోరాటాన్ని మాత్రం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
అభిషేక్ శర్మ....
ఈ ఐపీఎల్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా నిలుస్తోన్నాడు అభిషేక్‌శర్మ. ఐపీఎల్ 2024లో అభిషేక్ స్ట్రైక్ రేట్ 197గా ఉందంటే అతడి విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ఊహించుకోవచ్చు. ఆరు మ్యచుల్లో 211 రన్స్ చేశాడు అభిషేక్ శర్మ. అతడి ఫామ్ దృష్ట్యా టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కవచ్చని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతోన్నారు.
రియాన్ పరాగ్…
రియాన్ పరాగ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైంది. అడపాదడపా మెరుపులు మెరిపించడం తప్పితే నిలకడగా ఎప్పుడు ఆడిందిలేదు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన అతడిని రాజస్థాన్ రాయల్స్ టోర్నీ మధ్యలోనే పక్కనపెట్టింది. ఆ అవమానాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్న రియాన్ పరాగ్ ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.
2024 ఐపీఎల్‌లో రియాన్ పరాగ్ ఏడు మ్యాచుల్లో 318 రన్స్ చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే బెస్ట్ సీజన్ కావడం గమనార్హం. ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో కోహ్లి తర్వాతసెకండ్ ప్లేస్‌లో రియాన్ పరాగ్ ఉన్నాడు.
మయాంక్ యాదవ్...
ఇండియాలో 150 కిమీ వేగంగా బౌలింగ్ చేసే బౌలర్లు లేరు అనే ప్రశ్నకు మయాంక్ యాదవ్ రూపంలో ఈ ఐపీఎల్‌తో సమాధానం దొరికింది. ఈ ఐపీఎల్‌లో 157 కిమీ వేగంగా బౌలింగ్ చేసి క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యపరిచాడు ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్. ఈ సీజన్‌లో వేగవంతమైన బాల్ వేసిన రికార్డ్ అతడి పేరిట నమోదైంది.
ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు మూడు మ్యాచులు మాత్రమే ఆడిన మయాంక్ యాదవ్ ఆరు వికెట్లు తీసుకున్నాడు. రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. అతడి బౌలింగ్ స్పీడులోని ఖచ్చితత్వం, లైన్ అండ్ లెంగ్త్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడిని టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికచేయాలని సలహాలు ఇస్తున్నారు.
శశాంక్‌సింగ్, హర్షిత్ రాణా కూడా...
వీరితో పాటు శశాంక్‌సింగ్, జితేష్ శర్మ, అంగ్‌క్రిష్ రఘువన్షీ, హర్షిత్ రాణాతో పాటు మరికొందరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ తమ ఆటతీరుతో అదరగొడుతున్నారు.
టాపిక్