తెలుగు న్యూస్ / ఫోటో /
Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్
- Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ ను మించిపోయింది ముంబై ఇండియన్స్. ఈ బ్రాండ్ వాల్యూ ఆయా జట్ల ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది.
- Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ ను మించిపోయింది ముంబై ఇండియన్స్. ఈ బ్రాండ్ వాల్యూ ఆయా జట్ల ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది.
(1 / 9)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.(AFP)
(2 / 9)
Mumbai Indians Brand Value: ఈ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ లాగే సీఎస్కే కూడా ఐదు టైటిల్స్ గెలిచింది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 8.1 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.675 కోట్లు. ఈ ఫ్రాంఛైజీకి ధోనీయే ప్రధాన ఫేస్ వాల్యూగా కొనసాగుతున్నాడు.(AP)
(3 / 9)
Mumbai Indians Brand Value: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ అతని బ్రాండ్ వాల్యూతోనే తన బ్రాండ్ వాల్యూనీ పెంచుకుంది. ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ వాల్యూ 7.86 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.655 కోట్లు. (PTI)
(4 / 9)
Mumbai Indians Brand Value: ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా.. విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ వాల్యూ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 6.98 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.582 కోట్లు.(AFP)
(5 / 9)
Mumbai Indians Brand Value: ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ వాల్యూ 6.41 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ టీమ్ కూడా ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేదు. అయినా ఈ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్ ఈ జట్టు బలం.(AFP)
(6 / 9)
Mumbai Indians Brand Value: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఈ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 4.82 కోట్ల డాలర్లు. అంటే రూ.402 కోట్లు. సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.(PTI)
(7 / 9)
Mumbai Indians Brand Value: పంజాబ్ కింగ్స్ ఏడోస్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ 4.53 కోట్ల డాలర్లు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోఓనర్ గా ఉన్న ఫ్రాంఛైజీ ఇది.(IPL)
(8 / 9)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 4.2 కోట్ల డాలర్లుగా ఉంది. తొలి సీజన్ తర్వాత మరో టైటిల్ గెలవకపోవడంతో ఈ టీమ్ బ్రాండ్ వాల్యూలో పెద్దగా మార్పు ఉండటం లేదు.(PTI)
ఇతర గ్యాలరీలు