IND vs ENG Semi Final 2024: మా వర్రీ అదొక్కటే - సెమీస్‌కు రిజర్వ్‌డే లేకపోవడంపై రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో నేడు(గురువారం) టీమిండియా తలపడనుంది. గయానా వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సెమీస్ మ్యాచ్ టైమ్‌తో పాటు వెదర్ కండీషన్స్‌పై రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో నేడు (గురువారం) ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. వరల్డ్ కప్‌లో ఒక్క ఓటమి లేకుండా టీమిండియా అప్రతిహత విజయాలతో దూసుకుపోతుంది. లీగ్ దశతో పాటు సూపర్ 8లో ఆడిన ఆరు మ్యాచుల్లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో ఆఫ్గానిస్తాన్, పాటు బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ చేరుకుంది.
అడ్వాంటేజ్ కాదు...
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా అదే జోరును కొనసాగిస్తే ఫైనల్ చేరడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ చెబుతోన్నారు. ఆ వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్ డే టైమ్‌లోనే జరిగింది. సెమీస్ మ్యాచ్‌ను కూడా డే టైమ్‌లోనే షెడ్యూల్ చేశారు. ఇండియాకు ఫేవర్‌గా ఉండాలనే ఐసీసీ ఇలా డే మ్యాచ్‌లను షెడ్యూల్ చేసిందని విమర్శలొస్తున్నాయి. ఈ విమర్శలపై తనదైన శైలిలో రోహిత్ స్పందించాడు. ఆటపై ఫోకస్ తప్ప ఇలాంటి పుకార్లను తాము పట్టించుకోవడం లేదని తెలిపాడు. అన్ని డే టైమ్ మ్యాచ్‌లే ఉండటం అన్నది అడ్వాంటేజ్‌గా తాము భావించడం లేదని రోహిత్ చెప్పాడు.
వాటితో సంబంధం లేదు…
"పిచ్, డే టైమా... డే అండ్ నైటా, వేదిక ఏది లాంటివాటితో సంబంధం లేకుండా ఎవరూ బాగా ఆడితే వారే గెలుస్తారు. తాను ఆ కోణం నుంచే సెమీస్ మ్యాచ్‌ను చూస్తున్నానని రోహిత్ శర్మ చెప్పాడు. గయానా పిచ్‌పై ఆడిన అనుభవంతో ఇండియన్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లకు ఉందని అన్నాడు. అలాంటప్పుడు పిచ్, మ్యాచ్ టైమ్ అన్నది ఇండియాకు ఎలా అడ్వాంటేజ్‌గా మారుతుందని రోహిత్ పేర్కొన్నాడు. జట్టుగా కలిసికట్టుగా ఆడటంపైనే దృష్టిసారిస్తున్నామని, అంతే తప్ప ఇలాంటి అవసరమైన విషయాల గురించి ఆలోచించడం లేదని అన్నాడు.
అది ఐసీసీనే చూసుకుంటుంది.
సౌతాఫ్రికా, ఆఫ్గానిస్తాన్ మధ్య గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డేను కేటాయించింది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగనున్న మ్యాచ్‌కు మాత్రం రిజర్వ్‌డే లేదని తేల్చిచెప్పింది. గురువారం మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడితే అదనంగా 250 నిమిషాల టైమ్‌ను కేటాయించింది. లోపు ఫలితం తేలకపోతే గ్రూప్‌లో టాపర్‌గా నిలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. అదే జరిగితే ఇండియా ఫైనల్ బెర్తును కన్ఫామ్ చేసుకుంటుంది.
రిజర్డ్ డేపై రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు. వాతావరణాన్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదని రోహిత్ శర్మ. వర్షం కురుస్తుందా? లేదా అన్నది ఎవరూ చెప్పలేరు. అంచనా వేయడం కూడా సాధ్యం కాదని రోహిత్ శర్మ అన్నాడు. “మ్యాచ్ ముగిసిన వెంటనే మా ఫ్లైట్ ఉంది. ఒకవేళ మ్యాచ్ ఆలస్యమైతే మేము ఆ ఫ్లైట్ మిస్సయ్యే అవకాశం ఉంది. దాని గురించే మేము ఎక్కువగా వర్రీ అవుతున్నాం. ఒకవేళ మేము ఫ్లైట్ మిస్సయితే ఏం చేయాలన్నది ఐసీసీతో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ చూసుకుంటాయి కాబట్టి అది కూడా మేము ఇబ్బందిగా భావించడం లేదు. సెమీస్‌లో గెలవాలనే టార్గెట్‌ను పెట్టుకున్నాం. మాకు రిజల్ట్ అనుకూలంగా రావడంపైనే దృష్టి పెట్టాం” అని అన్నాడు.
కాగా టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై విజయంతో సౌతాఫ్రికా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది ఆఫ్గానిస్తాన్. సెమీస్‌లో తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల జోరుతో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. ఈ టార్గెట్‌ను 8.5 ఓవర్లలోనే సౌతాఫ్రికా ఛేదించింది.