ENG vs OMAN: వరల్డ్ కప్‌లో విచిత్రం - 19 బాల్స్‌లోనే మ్యాచ్ ముగించిన ఇంగ్లండ్ - నెటిజన్ల ట్రోల్స్...
ENG vs OMAN: టీ20 వరల్డ్ కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ మూడు ఓవర్లలోనే ముగించింది. ఒమన్ విధించిన 48 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ 19 బాల్స్‌లోనే ఛేదించింది.
ENG vs OMAN: టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్ అంచనాలకు మించి సాగుతోంది. సిక్సర్లు, ఫోర్ల మెరుపులు లేవు. సెంచరీలు, మెరుపు ఇన్నింగ్స్‌ల ఊసే లేదు. ఈ వరల్డ్ కప్‌లో బౌలర్లదే ఆధిపత్యం కొనసాగుతోంది. వంద పరుగుల దాటడానికే అగ్ర జట్టు సైతం తలమునకలు . అవుతోన్నాయి.
47 పరుగులకు ఆలౌట్...
తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో ఓ విచిత్రం జరిగింది. మూడు ఓవర్లలోనే ప్రత్యర్థిపై ఇంగ్లండ్ జట్టు విజయాన్ని అందుకొని రికార్డులు సృష్టించింది. గురువారం ఒమన్‌తో ఇంగ్లండ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ల జోరుతో ఒమన్ 13. 2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. ఒమన్ బ్యాట్స్‌మెన్స్‌లో షోయబ్ ఖాన్ 11 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్ బ్యాట్స్‌మెన్స్‌లో ఇద్దరు డకౌట్ కాగా...ముగ్గురు ఒక్కో పరుగు మాత్రమే చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు.
19 బాల్స్‌లోనే...
48 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ 3.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ జోస్ బట్లర్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 8 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 రన్స్ చేశాడు. ఫిలిప్ సాల్ట్ మూడు బాల్స్‌లోనే రెండు సిక్సర్లతో పన్నెండు పరుగులు చేశాడు. తాను ఎదుర్కొన్న రెండు బాల్స్‌ను సిక్సర్లుగా మలిచాడు. వీరిద్దరి జోరుతో కేవలం 19 బాల్స్‌లోనే ఈమ్యాచ్ ముగియడం గమనార్హం.
ఇంగ్లండ్ రికార్డ్...
వరల్డ్ కప్‌లో అత్యధిక బాల్స్ మిగిలుండగానే గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 101 బాల్స్ మిగిలుండగానే ఒమన్‌ను ఇంగ్లండ్ ఓడించింది. గతంలో నెదర్లాండ్స్‌పై శ్రీలంక 99 బాల్స్ మిగిలుండగా విజయాన్ని అందుకున్నది. ఈ రికార్డ్‌ను ఒమన్ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ తిరగరాసింది.
గల్లీ క్రికెట్ లా...
కాగా నెటిజన్లు ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ మీమ్స్ చేస్తోన్నారు. ఇవేం పిచ్‌లు అంటూ విమర్శలు గుప్పిస్తోన్నారు. మ్యాచ్ చూడటానికి రెడీ అయ్యేలోపే ముగిసిపోయిందని చెబుతోన్నారు. టీ20 వరల్డ్ కప్‌లా లేదని, గల్లీ క్రికెట్ మ్యాచ్‌లా ఉందని అంటోన్నారు.
ఇంగ్లండ్ సూపర్ 8 బెర్తు డౌట్
కాగా టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విక్టరీ. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది ఇంగ్లండ్. ఆ తర్వాత కెనడాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం మూడు మ్యాచుల్లో ఓ గెలుపుతో గ్రూప్ బీలో ఇంగ్లండ్ మూడో స్థానంలో ఉంది. మూడు విజయాలతో ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. సూపర్ 8లో మరో బెర్తు కోసం నమీబియా తో ఇంగ్లండ్ పోటీపడుతోంది.ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది