తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరిన విరాట్ కోహ్లి, టీమిండియా ప్లేయర్స్

Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరిన విరాట్ కోహ్లి, టీమిండియా ప్లేయర్స్

Hari Prasad S HT Telugu

17 June 2024, 16:49 IST

google News
    • Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ లో కీలకమైన మ్యాచ్ లకు ముందు టీమిండియా ప్లేయర్స్ బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరారు. ప్రస్తుతం టీమ్ కరీబియన్ దీవుల్లోని బార్బడోస్ లో ఉంది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరిన విరాట్ కోహ్లి, టీమిండియా ప్లేయర్స్
టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరిన విరాట్ కోహ్లి, టీమిండియా ప్లేయర్స్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కు ముందు బీచ్ వాలీబాల్ ఆడుతూ సేదదీరిన విరాట్ కోహ్లి, టీమిండియా ప్లేయర్స్

Team India: టీమిండియా ప్లేయర్స్ కీలకమైన సూపర్ 8 స్టేజ్ మ్యాచ్ లకు ముందు కాస్త రిలాక్స్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో తొలిసారి అమెరికా వదిలి వెస్టిండీస్ లో అడుగుపెట్టిన ప్లేయర్స్.. అక్కడి బీచ్ లలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లి సహా కొందరు ప్లేయర్స్ బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

టీమిండియా ప్లేయర్స్ బీచ్ వాలీబాల్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లు ఆడేందుకు టీమిండియా ప్లేయర్స్ బార్బడోస్ చేరుకున్నారు. గురువారం (జూన్ 20) తొలి సూపర్ 8 మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో ఆడాల్సి ఉంది. దీంతో అంతకుముందు దొరికిన ఖాళీ సమయాన్ని సరదాగా గడిపేస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లి, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబె, చహల్ లాంటి ప్లేయర్ష్ తోపాటు సపోర్టింగ్ స్టాఫ్ బీచ్ వాలీబాల్ ఆడారు.

దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. బీసీసీఐ ఈ వీడియోను షేర్ చేసింది. క్రికెట్ తోపాటు వాలీబాల్ లోనూ తమ స్కిల్స్ చూపించే ప్రయత్నం చేశారు. షర్ట్ లేకుండా తన యాబ్స్ చూపిస్తూ కోహ్లి ఇలా బీచ్ వాలీబాల్ ఆడాడు. ఈ వరల్డ్ కప్ గ్రూప్ ఎలో ఉన్న టీమిండియా.. ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్ఏలను ఓడించింది. కెనడాతో మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే.

గ్రూప్ ఎ నుంచి ఇండియాతోపాటు యూఎస్ఏ కూడా సూపర్ 8కు అర్హత సాధించింది. ఈ స్టేజ్ లో టీమిండియా తన తొలి మ్యాచ్ ను బార్బడోస్ లోనే ఆడనుంది. అయితే లీగ్ మ్యాచ్ లన్నీ అమెరికాలోని న్యూయార్క్ లోనే ఆడిన టీమిండియాకు కరీబియన్ వాతావరణం అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. మరి తొలి మ్యాచ్ లో దీని ప్రభావం ఎంత ఉంటుందనేది చూడాలి.

సూపర్ 8లో టీమిండియా షెడ్యూల్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్ 8 కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సోమవారం (జూన్ 17) చివరి లీగ్ మ్యాచ్ లో నేపాల్ ను చిత్తు చేసి క్వాలిఫై అయింది. ఇండియాతోపాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, యూఎస్ఏ సూపర్ 8కు అర్హత సాధించాయి. పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ టీమ్స్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాయి.

జూన్ 20 : ఇండియా వెర్సెస్ ఆఫ్ఘనిస్థాన్, బార్బడోస్

జూన్ 22: ఇండియా వెర్సెస్ బంగ్లాదేశ్, ఆంటిగ్వా

జూన్ 24: ఇండియా వెర్సెస్ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియా

ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. వీటిని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్ లో ఉచితంగా చూడొచ్చు. లేదంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో బ్రాడ్ కాస్ట్ అవుతాయి.

తదుపరి వ్యాసం