తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India In Whatsapp: వాట్సాప్‌లో టీమిండియా.. ఇలా ఫాలో అయిపోండి

Team India in Whatsapp: వాట్సాప్‌లో టీమిండియా.. ఇలా ఫాలో అయిపోండి

Hari Prasad S HT Telugu

14 September 2023, 21:02 IST

google News
    • Team India in Whatsapp: టీమిండియా వాట్సాప్ లోకి వచ్చింది. ఈ విషయాన్ని గురువారం (సెప్టెంబర్ 14) బీసీసీఐ వెల్లడించింది. టీమ్ న్యూస్ కోసం వాట్సాప్ లో టీమ్ ను ఫాలో కావచ్చు.
టీమిండియా
టీమిండియా (AP)

టీమిండియా

Team India in Whatsapp: టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఎప్పటికప్పుడు టీమ్ గురించి న్యూస్ తెలుసుకోవడంతోపాటు తెర వెనుక ఏం జరుగుతుంది? ప్లేయర్స్ ఏం చేస్తుంటారు? వంటి విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. అలాంటి అభిమానుల కోసం ఇండియన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు వాట్సాప్ లోకి వచ్చినట్లు బీసీసీఐ గురువారం (సెప్టెంబర్ 14) వెల్లడించింది.

"టీమిండియా ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్ లోకి వచ్చింది. తాజా అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు, తెర వెనుక జరిగే కంటెంట్ కోసం కనెక్ట్ అవండి" అని బీసీసీఐ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే ఈ వాట్సాప్ ఛానెల్స్ ద్వారా టీమిండియా న్యూస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది తప్ప టీమ్ సభ్యులతో చాట్ చేసే అవకాశం మాత్రం ఉండదని గుర్తుంచుకోవాలి.

అయితే వాట్సాప్ ఛానెల్ ద్వారా ఇండియన్ క్రికెట్ టీమ్ అభిమానులకు మరింత చేరువైందని మాత్రం చెప్పొచ్చు. ఇండియన్ క్రికెట్ టీమ్ వాట్సాప్ ఛానెల్ ను ఫాలో అయ్యే అభిమానులకు ఎప్పటికప్పుడు టీమ్ కు సంబంధించిన న్యూస్ అందుతుంది. నేరుగా వాళ్లకే ఫోన్ కే ఈ సమాచారం రావడాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మెన్ ఇన్ బ్లూకి సంబంధించిన ప్రతి న్యూస్ వాట్సాప్ లో షేర్ చేయనుండటంతో టీమ్ వార్తల కోసం మరో చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వరల్డ్ కప్ కు ముందు ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ కు ఈ వాట్సాప్ ఛానెల్స్ గుడ్ న్యూస్ అందించాయి. ఇప్పటికే ఇండియన్ టీమ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లలో ఉంది.

అయితే వాట్సాప్ ఎంట్రీ మాత్రం మరో లెవల్ అని చెప్పొచ్చు. దీనిద్వారా నేరుగా అభిమానుల చెంతకే టీమ్ న్యూస్ చేరుతుంది. ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఆసియా కప్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ సేన ఫైనల్ చేరింది. శుక్రవారం నామమాత్రపు మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనుండగా.. ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్థాన్ లలో ఒకరితో ట్రోఫీ కోసం తలపడనుంది.

తదుపరి వ్యాసం