తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad: కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. ఈసారి సన్ రైజర్స్‌దే కప్పు.. ఎందుకో తెలుసా?

Sunrisers Hyderabad: కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. ఈసారి సన్ రైజర్స్‌దే కప్పు.. ఎందుకో తెలుసా?

Hari Prasad S HT Telugu

07 March 2024, 21:28 IST

google News
    • Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ గురువారం (మార్చి 7) కొత్త ఐపీఎల్ సీజన్ కోసం కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ఈ మధ్యే కొత్త కెప్టెన్ ను కూడా అనౌన్స్ చేసిన ఆ టీమ్ దే ఈసారి ట్రోఫీ అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. దీనికి ఓ బలమైన కారణమే ఉంది.
కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. ఈసారి సన్ రైజర్స్‌దే కప్పు.. ఎందుకో తెలుసా?
కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. ఈసారి సన్ రైజర్స్‌దే కప్పు.. ఎందుకో తెలుసా?

కొత్త జెర్సీ.. కొత్త కెప్టెన్.. కొత్త సీజన్.. ఈసారి సన్ రైజర్స్‌దే కప్పు.. ఎందుకో తెలుసా?

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త జెర్సీని గురువారం (మార్చి 7) లాంచ్ చేసింది. నిప్పుతో ఆడండి అనే హ్యాష్‌ట్యాగ్ తో ఈ ఫ్రాంఛైజీ సరికొత్త జెర్సీని తీసుకొచ్చింది. ఆ టీమ్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ జెర్సీలో మెరిసిపోయాడు. సీజన్ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మార్చి 23న తలపడనుంది.

సన్ రైజర్స్ కొత్త జెర్సీ

సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది దారుణమైన ప్రదర్శనతో టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ లలో కేవలం 4 గెలిచింది. అయితే కొత్త సీజన్ ను మాత్రం ఆ టీమ్ కొత్త ఆశలతో ప్రారంభించడానికి ఓ సరికొత్త జెర్సీని లాంచ్ చేసింది. "హైదరాబాద్ మండుతున్న జ్వాలను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం" అనే క్యాప్షన్ తో ఈ కొత్త జెర్సీని లాంచ్ చేశారు.

ఈ కొత్త జెర్సీ గతంలో ఉన్న వాటికి పూర్తి భిన్నంగా ఉంది. ఆరెంజ్, బ్లాక్ కలర్స్ మిక్స్ చేసిన ఈ జెర్సీని తీసుకొచ్చారు. రెండు రోజుల కిందటే సన్ రైజర్స్ టీమ్ హైదరాబాద్ లో తమ క్యాంప్ మొదలు పెట్టారు. ఈసారి కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ సారథ్యంలో మరోసారి ట్రోఫీ సాధించాలన్న పట్టుదలతో ఆ టీమ్ ఉంది.

ఆస్ట్రేలియా కెప్టెన్ గెలిపిస్తాడా?

హైదరాబాద్ జట్టుకు, ఆస్ట్రేలియా కెప్టెన్ కు విడదీయలేని బంధం ఉంది. గతంలో ఐపీఎల్లో హైదరాబాద్ కు డెక్కన్ ఛార్జర్స్ టీమ్ ప్రాతినిధ్యం వహించింది. ఆ టీమ్ కు అప్పటి ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలోనే తొలిసారి 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత లీగ్ నుంచి డెక్కన్ ఛార్జర్స్ సైడైపోయింది. దాని స్థానంలో సన్ రైజర్స్ పేరుతో మరో హైదరాబాద్ ఫ్రాంఛైజీ వచ్చింది. ఈ కొత్త టీమ్ కూడా 2016లో మరో ట్రోఫీ గెలిచింది. అప్పుడు కూడా జట్టుకు ఓ ఆస్ట్రేలియా ప్లేయరే కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ మరోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఇక ఇప్పుడు కూడా మరో ఆస్ట్రేలియా కెప్టెనే సన్ రైజర్స్ కు కెప్టెన్ అయ్యాడు. గతేడాది దారుణమైన ప్రదర్శన తర్వాత వేలంలో ప్యాట్ కమిన్స్ ను ఏకంగా రూ.20.5 కోట్లు పెట్టి ఈ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అప్పటికే అతడు ఆస్ట్రేలియాను ఆరోసారి విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో సన్ రైజర్స్ కెప్టెన్సీ అతనికే అని అందరూ ఫిక్సయ్యారు.

అనుకున్నట్లే ఈ మధ్యే సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ ప్యాట్ కమిన్స్ కు కెప్టెన్సీ అప్పగించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఓ ఆస్ట్రేలియా కెప్టెన్ నేతృత్వంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంటుందా అన్న అంచనా మొదలైంది. అభిమానులు కూడా అదే ఆశతో కొత్త సీజన్ కోసం వేచి చూస్తున్నారు.

తదుపరి వ్యాసం