David Warner Rare Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. కోహ్లి, టేలర్ తర్వాత అతడే.. ఆసీస్ చేతుల్లో విండీస్ చిత్తు-david warner rare record third cricketer after virat kohli and ross taylor played more than 100 matches in all formats ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  David Warner Rare Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. కోహ్లి, టేలర్ తర్వాత అతడే.. ఆసీస్ చేతుల్లో విండీస్ చిత్తు

David Warner Rare Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. కోహ్లి, టేలర్ తర్వాత అతడే.. ఆసీస్ చేతుల్లో విండీస్ చిత్తు

Hari Prasad S HT Telugu
Feb 09, 2024 05:13 PM IST

David Warner Rare Record: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లి, రాస్ టేలర్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ గా నిలిచాడు.

కెరీర్లో 100వ టీ20 మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు
కెరీర్లో 100వ టీ20 మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు

David Warner Rare Record: ఈమధ్యే టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శుక్రవారం (ఫిబ్రవరి 9) వెస్టిండీస్ తో తన 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లి, రాస్ టేలర్ మాత్రమే ఈ రికార్డు క్రియేట్ చేశారు.

డేవిడ్ వార్నర్‌కు సన్మానం

అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన డేవిడ్ వార్నర్ ను మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా టీమ్ సన్మానించింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ.. వార్నర్ గురించి మాట్లాడుతూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. "బుల్ (డేవిడ్ వార్నర్) ఆస్ట్రేలియా తరఫున 100 టీ20లు ఆడిన మూడో ప్లేయర్ గా నిలిచాడు. ముఖ్యంగా అతడు కోహ్లి, టేలర్ తర్వాత 100 టెస్టులు, 100 వన్డేలు, 100 టీ20లు ఆడిన మూడో ప్లేయర్ అయ్యాడు.

ఇంతకాలం క్రికెట్ లో కొనసాగడం ఇది నీ నైపుణ్యం, ఫిట్‌నెస్ కు నిదర్శనం" అని వెటోరీ అన్నాడు. "నువ్వు టెస్టుల నుంచి రిటైరైనప్పుడు వార్నర్ మూడు ఫార్మాట్లోనూ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడని అందరూ పొగిడారు. ఇప్పుడు నువ్వు 100వ టీ20 ఆడుతుండటం ఆ మాటలను నిజం చేశాయి" అని వెటోరీ చెప్పాడు.

చెలరేగిన వార్నర్

డేవిడ్ వార్నర్ తన 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో చెలరేగిపోయాడు. వెస్టిండీస్ తో జరిగిన ఈ తొలి టీ20 మ్యాచ్ లో వార్నర్ కేవలం 36 బంతుల్లోనే 70 రన్స్ చేయడం విశేషం. అందులో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. క్రీజులోకి వచ్చినప్పటి నుంచీ అతడు తనదైన స్టైల్లో ధాటిగా ఆడాడు. అతనికి మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ కూడా తోడవడంతో ఆస్ట్రేలియా స్కోరుబోర్డు పరుగులు పెట్టింది.

ఇంగ్లిస్ 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 39 రన్స్ చేశాడు. చివర్లో టిమ్ డేవిడ్ కేవలం 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 37, మాథ్యూ వేడ్ 21 రన్స్ చేయడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 రన్స్ చేసింది. విండీస్ బౌలర్లలో 4 ఓవర్లలో 42 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

ఆస్ట్రేలియా విజయం

డేవిడ్ వార్నర్ కు మైలురాయిలాంటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ పోరాడినా.. చివరికి ఆస్ట్రేలియానే 11 పరుగులతో గెలిచింది. వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 రన్స్ చేసింది. చివర్లో జేసన్ హోల్డర్ 15 బంతుల్లో 34 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది.

వెస్టిండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 37 బంతుల్లో 53, జాన్సన్ చార్లెస్ 25 బంతుల్లోనే 42 రన్స్ చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 8.3 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు. అయితే ఇద్దరితోపాటు తర్వాత వచ్చిన బ్యాటర్లంతా వెంటవెంటనే పెవిలియన్ కు చేరడంతో వెస్టిండీస్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 4 ఓవర్లలో కేవలం 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

Whats_app_banner