Rohit Sharma: టీ20 ప్రపంచకప్‍కు ముందు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన సౌరవ్ గంగూలీ
14 May 2024, 19:43 IST
- Sourav Ganguly on Rohit Sharma: ఐపీఎల్ 2024 సీజన్‍లో మంబై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఫామ్‍పై కాస్త టెన్షన్ నెలకొంది. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు రోహిత్ ఫామ్ కోల్పోవడంపై ఆందోళన నెలకొంది. అయితే, ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడారు.
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‍కు ముందు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన సౌరవ్ గంగూలీ
Sourav Ganguly - Rohit Sharma: టీ20 ప్రపంచకప్ మెగాటోర్నీ సమీపిస్తోంది. జూన్ 2వ తేదీనే ఈ టోర్నీ ఆరంభం కానుంది. అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ విషయంలో ప్రస్తుతం టెన్షన్ నెలకొంది. ముంబై ఇండియన్స్ తరఫున ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 29 యావరేజ్‍తో 349 రన్స్ చేశాడు. అయితే, చివరి ఆరు మ్యాచ్‍ల్లో 6,8,4,11,4,19 ఇలా వరసగా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. దీంతో టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో హిట్‍మ్యాన్ ఫామ్ కోల్పోవడంతో టెన్షన్ నెలకొంది.
రోహిత్ బాగా ఆడతాడు
ఐపీఎల్‍లో రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడం గురించి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. రోహిత్ శర్మ బిగ్ టోర్నమెంట్ ప్లేయర్ అని, ప్రపంచకప్‍లో అతడు బాగా ఆడతాడనే నమ్మకాన్ని దాదా వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మ తిరిగి ఫామ్‍ను అందుకుంటాడని మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సౌరవ్ గంగూలీ చెప్పాడు. “టీమిండియా చాలా మంచి జట్టు. ప్రపంచకప్‍లో రోహిత్ శర్మ చాలా బాగా ఆడతాడు. పెద్ద టోర్నీల్లో అతడు బాగా ఆడతాడు. బిగ్ స్టేజ్‍ల్లో అతడు మంచి ప్రదర్శన చేస్తాడు” అని ప్రవీణ్ ఆమ్రే బుక్ లాంచ్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గంగూలీ చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‍ల్లో రోహిత్ శర్మకు మంచి రికార్డే ఉంది. టీ20 ప్రపంచకప్‍ల్లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‍లు ఆడిన హిట్‍మ్యాన్ 963 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్‍ల్లోనూ రోహిత్‍కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. ఐసీసీ టోర్నీలంటేనే రెచ్చిపోయి ఆడతాడనే పేరు రోహిత్‍కు ఉంది. గంగూలీ కూడా టీ20 ప్రపంచకప్‍లో రోహిత్ శర్మ అదరగొడతాడని, ఐపీఎల్ ఫామ్ చూసి టెన్షన్ పడొద్దనేలా కామెంట్లు చేశారు.
టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ.. రోహిత్ శర్మను ఒప్పించి మరీ కెప్టెన్‍గా నియమించాడు.
పంత్ లేని లోటు కనిపించింది
ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్‌గా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. కాగా, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఇటీవల స్లో ఓవర్ రేట్ కారణంగా ఓ మ్యాచ్ నిషేధం పడింది. దీంతో మే 12న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‍ను పంత్ ఆడలేకపోయాడు. ఆ కీలక మ్యాచ్‍లో ఢిల్లీ 47 పరుగుల భారీ తేడాతో బెంగళూరుపై ఓడింది. పంత్ దూరమవటంతో ఆ మ్యాచ్‍కు అక్షర్ కెప్టెన్సీ చేశాడు.
అయితే, పంత్ లేని లోటు ఆ మ్యాచ్‍లో బ్యాటింగ్‍లో కనిపించిందని గంగూలీ చెప్పాడు. “రిషబ్ పంత్ లేకపోవడంతో మా బ్యాటింగ్‍లో చాలా డిఫరెన్స్ కనిపించింది” అని గంగూలీ చెప్పారు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో 13 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచిన ఢిల్లీ ఏడింట ఓడింది. లీగ్ దశలో తన చివరి మ్యాచ్‍లో లక్నోతో నేడు (మే 14) ఆడనుంది. ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచినా.. ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఒకవేళ భారీగా గెలిస్తే.. ఇతర జట్ల సమీకరణాలు కలిసి వస్తే కాస్త ఛాన్స్ ఉండొచ్చు.