Rohit Sharma : ఐపీఎల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన- టీ20 వరల్డ్ కప్‌పై ఎఫెక్ట్?
Rohit Sharma IPL 2024 : ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆందోళనకరంగా మారింది. చివరి 6 ఇన్నింగ్స్‌లలో అతను కేవలం 33 పరుగులే చేశాడు!
Rohit Sharma IPL 2024 : టీ20 వరల్డ్ కప్‌కు సమీపిస్తున్న తరుణంలో.. టీమిండియా అభిమానులకు కలవరపాటు! ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఈ ముంబై ఇండియన్స్ ఓపెనర్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. అంతేకాదు.. గత 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 33 పరుగులే చేశాడు రోహిత్ శర్మ. అతని ప్రదర్శనపై క్రికెట్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోహిత్ శర్మకు ఏమైంది..?
ఐపీఎల్ 2024 నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని తీసుకుని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది జట్టు యాజమాన్యం. ఇది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. జట్టు చెత్త ప్రదర్శనతో మొన్నటివరకు ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. వీటన్నింటి మధ్య.. రోహిత్ శర్మ బ్యాటింగ్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
సోమవారం మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌కి చాలా కీలకం. అలాంటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 173 రన్స్ చేసింది. 174 పరుగుల టార్గెట్‌లో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కు మొదట్లోనే షాక్ తగిలింది! మొదటి బంతికే 4 కొట్టి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు రోహిత్. కానీ.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఫ్లిక్ షాట్ ఆడబోయి, బాల్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ క్లాసెన్ పట్టుకున్నాడు.
Rohit Sharma stats : రోహిత్ శర్మను ప్యాట్ కమిన్స్ ఔట్ చేయ్యడం.. టీ20ల్లో ఇది నాలుగో సారి! పైగా.. 41 బాల్స్ ఆడిన రోహిత్ చేసింది 57 పరుగులు మాత్రమే! యావరేజ్ 14.25గా ఉంది.
ఇదీ చూడండి:- MI vs SRH: వాంఖడేలో సూర్య సెంచరీ వీరంగం.. హైదరాబాద్‍ను దెబ్బకొట్టిన ముంబై ఇండియన్స్
సాధారణంగా.. ఐపీఎల్ ఒక్కటే అయితే రోహిత్ ప్రదర్శనపై అంత ఆందోళన ఉండదు. కానీ.. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టీమిండియా ఈసారైనా కప్ కొట్టాలంటే.. కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రాణించడం చాలా ముఖ్యం.
ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ చెత్త ప్రదర్శనపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.
"రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 4. అతను చేసిన పరుగులు 4. తన జెర్సీ నెంబర్ని బాగా ప్రమోట్ చేసుకున్నాడు," అని ఒక నెటిజన్ సెటైర్ వేశాడు.
MI vs SRH highlights : "ప్రస్తుత ప్రదర్శనని చూస్తే.. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ స్థానాన్ని ప్రశ్నించాలి. 15 మంది సభ్యుల్లో.. అతను ఒక్కడే మరీ చెత్తగా ఆడుతున్నాడు," అని ఇంకొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
"రోహిత్ శర్మ వెంటనే అజిత్ అగార్కర్‌కి కాల్ చేసి టీమిండియా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాలి. ఈ ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్‌కి వెళ్లలేవు. సారీ నాట్ సారీ," అని మరొకరు పేర్కొన్నారు.
"రోహిత్ శర్మ పనైపోయింది. టీ20ల్లో రోహిత్ పెద్దగా ఆడట్లేదు. కెప్టెన్ కాకపోతే.. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో అతను జట్టులో కూడా ఉండేవాడు కాదు!," అని ఇంకొకరు అన్నారు.
Rohit Sharma T20 world cup : "ఇలాంచి చెత్త ప్రదర్శనతో రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్‌లోకి వెళుతున్నాడు. టీమిండియాను లీడ్ చేస్తాడు. అతని ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు," అని మరో క్రికెట్ అభిమాని రాసుకొచ్చాడు.
సంబంధిత కథనం