తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: వన్డే చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ

Rohit Sharma: వన్డే చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ

14 October 2023, 21:15 IST

google News
    • Rohit Sharma: పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో రోహిత్ శర్మ మరోసారి సత్తాచాటాడు. వీర హిట్టింగ్‍తో విరుచుకుపడి.. భారత్‍ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
Rohit Sharma: వన్డే చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ
Rohit Sharma: వన్డే చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma: వన్డే చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ

Rohit Sharma: భారత కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రికార్డులను బద్దులుకొట్టుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో సత్తాచాటుతున్న హిట్‍మ్యాన్ రికార్డులను వేటాడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అహ్మదాబాద్ వేదికగా శనివారం (అక్టోబర్ 14) పాకిస్థాన్‍తో జరిగిన మ్యాచ్‍లో భారత్ 7 వికెట్ల తేడాతో 117 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాది మొత్తంగా 86 పరుగులు చేశాడు. టీమిండియా సునాయాసంగా గెలవటంతో హిట్‍మ్యాన్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఆ వివరాలివే..

పాకిస్థాన్‍తో మ్యాచ్‍లో మూడో సిక్సర్ బాదాక అంతర్జాతీయ వన్డే క్రికెట్‍లో తన 300 సిక్స్‌ను రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 300 సిక్సర్ల మార్క్ చేరిన తొలి భారత ప్లేయర్‌గా హిట్‍మ్యాన్ నిలిచాడు. ఓవరాల్‍గా 300 వన్డే సిక్సర్ల జాబితాలో మూడో ఆటగాడిగా నిలిచాడు. వన్డేల సిక్సర్ల విషయంలో షాహిద్ అఫ్రిది (351), క్రిస్ గేల్ (331) మాత్రమే హిట్‍మ్యాన్ ముందున్నారు.

మరోవైపు, అంతర్జాతీయ క్రికెట్‍లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్ల రికార్డును ఇటీవలే తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్ శర్మ. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్‍(553)ను హిట్‍మ్యాన్ దాటేశాడు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్‍లో 562 సిక్సర్లు బాదాడు రోహిత్ శర్మ. అలాగే, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డును కూడా రోహిత్ (6) సొంతం చేసుకున్నాడు. అఫ్గానిస్థాన్‍తో మ్యాచ్‍లో శతకం చేసి ఈ చరిత్ర సృష్టించాడు.

ఇక, శనివారం (అక్టోబర్ 14) పాకిస్థాన్‍తో జరిగిన మ్యాచ్‍లో గెలిచిన టీమిండియా.. వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటి పాక్‍ను దెబ్బతీశారు. ఆ తర్వాత రోహిత్ శర్మ (86), శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) రాణించటంతో 30.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలిచింది.

తదుపరి వ్యాసం