Rohit Sharma Records: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్‍ను దాటి.. మరో రెండు కూడా..
Rohit Sharma Record: అఫ్గానిస్థాన్‍తో ప్రపంచకప్ మ్యాచ్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపాడు. సూపర్ హిట్టింగ్‍తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో కొన్ని రికార్డులను సృష్టించాడు.
Rohit Sharma Record: భారత కెప్టెన్, హిట్‍మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. తన పేరిట మరిన్ని రికార్డును లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా అఫ్గానిస్థాన్‍తో నేడు (అక్టోబర్ 11) జరుగుతున్న మ్యాచ్‍లో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131 పరుగులు; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) దుమ్మురేపాడు. లక్ష్యఛేదనలో అఫ్గాన్ బౌలర్లను చితకబాదాడు. మెరుపు శతకం చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలుకొట్టాడు రోహిత్ శర్మ.
ఏడో సెంచరీతో..
48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డును సృష్టించాడు రోహిత్ శర్మ. 7 ప్రపంచకప్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‍గా చరిత్ర సృష్టించాడు. 19 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు హిట్‍మ్యాన్. సచిన్ 44 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు చేయగా.. దాన్ని ఇప్పుడు రోహిత్ అధిగమించాడు. 2015 వన్డే ప్రపంచకప్‍లో ఓ సెంచరీ చేశాడు రోహిత్. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్‍లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం 2023 ప్రపంచకప్‍లో నేడు అఫ్గాన్‍పై శతకం సాధించాడు. దీంతో ఏడో ప్రపంచకప్ సెంచరీతో రోహిత్ చరిత్ర సృష్టించాడు.
గేల్‍ను దాటి..
అంతర్జాతీయ క్రికెట్‍లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్ శర్మ. అఫ్గానిస్థాన్‍తో మ్యాచ్‍లో మూడో సిక్సర్ తర్వాత ఈ ఘనత సాధించాడు. 554 అంతర్జాతీయ సిక్సర్లకు చేరాడు. దీంతో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (553 సిక్సర్లు) రికార్డును బద్దలుకొట్టాడు రోహిత్ శర్మ.
ఫాస్టెస్ట్ సెంచరీ
వన్డే ప్రపంచకప్‍లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గానూ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అఫ్గానిస్థాన్‍తో ఈ మ్యాచ్‍లో 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు హిట్‍మ్యాన్.