తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit On Hardik Injury: హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత ఎంత.. కీలకమైన అప్డేట్ ఇచ్చిన రోహిత్

Rohit on Hardik Injury: హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత ఎంత.. కీలకమైన అప్డేట్ ఇచ్చిన రోహిత్

Hari Prasad S HT Telugu

19 October 2023, 22:12 IST

google News
    • Rohit on Hardik Injury: హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత ఎంత? దీనిపై బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. గాయం తీవ్రత అంతా లేదని చెప్పాడు.
హార్దిక్ పాండ్యా ఇలా గాయపడ్డాడు
హార్దిక్ పాండ్యా ఇలా గాయపడ్డాడు (AFP)

హార్దిక్ పాండ్యా ఇలా గాయపడ్డాడు

Rohit on Hardik Injury: హార్దిక్ పాండ్యా గాయం తీవ్రమైందా? వరల్డ్ కప్ లో తర్వాత జరగబోయే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో అతడు ఆడతాడా లేదా? అభిమానుల్లోని ఈ సందేహాలకు కెప్టెన్ రోహిత్ శర్మ సమాధానమిచ్చాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత అవార్డ్ సెర్మనీలో మాట్లాడిన రోహిత్.. హార్దిక్ గాయంపై కీలకమైన అప్డేట్ ఇచ్చాడు.

హార్దిక్ పాండ్యా గాయం అంత తీవ్రమైనదేమీ కాదని రోహిత్ చెప్పడం ఊరట కలిగించే విషయమే. "అతడు కాస్త కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఇది మాకు మంచి విషయమే. కానీ అలాంటి గాయం తగిలినప్పుడు మేము ప్రతి రోజూ అతని పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది. అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం" అని రోహిత్ చెప్పాడు.

ఇది ఒక రకంగా ఊరట కలిగించేదే. అతడు గాయపడిన విధానం చూసి అభిమానులు ఆందోళన చెందారు. తన తొలి ఓవర్ మూడో బంతికి బౌండరీ ఆపబోయి హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. నేరుగా వెళ్తున్న బంతిని తన కుడికాలితో ఆపడానికి ప్రయత్నించి కిందపడ్డాడు. అతడు తన ఎడమకాలిపై పడటంతో అతడు పైకి లేవలేకపోయాడు.

కోహ్లి అతనికి సాయం చేశాడు. తర్వాత ఫిజియో అతనికి చికిత్స చేయడంతో తిరిగి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కాలు నొప్పి వేధిస్తుండటంతో బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ ఫీల్డింగ్ కు దిగలేదు. ఇక హార్దిక్ గాయంతో మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా అప్డేట్ ఇచ్చాడు. హార్దిక్ పరిస్థితి ఎలా ఉందని గవాస్కర్ అడిగిన ప్రశ్నకు రాహుల్ స్పందించాడు.

తనకు ప్రస్తుత పరిస్థితి గురించి తెలియదని, డ్రెస్సింగ్ రూమ్ లో అతడు కుంటుతూ నడుస్తున్నట్లు మాత్రం చెప్పాడు. అయితే హార్దిక్ నవ్వుతూ కనిపించడం మాత్రం ఊరట కలిగించేదే అని రాహుల్ అన్నాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇండియా 7 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ 2023లో ఇది వరుసగా నాలుగో విజయం. అయితే ఆదివారం (అక్టోబర్ 22) న్యూజిలాండ్ తో కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో హార్దిక్ కోలుకోవడం చాలా అవసరం అనడంలో సందేహం లేదు.

తదుపరి వ్యాసం