తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rahul Dravid: వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవికి ద్రవిడ్ గుడ్ బై.. టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు!

Rahul Dravid: వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవికి ద్రవిడ్ గుడ్ బై.. టీమిండియాకు ఇద్దరు కోచ్‌లు!

Hari Prasad S HT Telugu

07 September 2023, 13:07 IST

    • Rahul Dravid: వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవికి ద్రవిడ్ గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు టీమిండియాకు ఇద్దరు కోచ్‌లను నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు కూడా సమాచారం.
 టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (PTI)

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం వరల్డ్ కప్ 2023 తర్వాత ముగియనుంది. అయితే ఈ వరల్డ్ కప్ గెలిచినా, గెలవకపోయినా ఆ తర్వాత ద్రవిడ్ ఈ పదవిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ గెలిస్తే టీమిండియా కోచ్ గా సగర్వంగా తన కెరీర్ ముగించాలని ద్రవిడ్ భావిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

PBKS vs RCB: డకౌట్ కావాల్సిన వాడు సెంచరీకి చేరువగా.. కోహ్లి బాదుడుతో ఆర్సీబీ భారీ స్కోరు

KL Rahul Captaincy: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి కేఎల్ రాహుల్ గుడ్ బై.. కారణం అదేనా?

Mumbai Indians: తిలక్ వర్మపై నోరు పారేసుకున్న హార్దిక్.. ముంబై ఇండియన్స్ సీనియర్ల గుస్సా

Sanjiv Goenka: సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్లు గ‌రంగ‌రం - రాహుల్ నీ ప‌నోడు కాదంటూ కామెంట్స్‌

వరల్డ్ కప్ గెలవకపోవడం లేదంటే కనీసం ఫైనల్ చేరుకోలేకపోయినా బీసీసీఐయే రాహుల్ ద్రవిడ్ ను తప్పించి మరో హెడ్ కోచ్ ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ కు వేర్వేరు కోచ్ లను నియమించే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. ఇంగ్లండ్ లాంటి టీమ్స్ ప్రస్తుతం ఇద్దరు కోచ్ లను నియమించాయి.

ఒకవేళ ద్రవిడ్ కోచ్ గా కొనసాగినా కేవలం టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితం చేసి, వన్డే, టీ20 టీమ్స్ కు మరో కోచ్ నియమించే అవకాశాలు ఉన్నాయి. టీ20 టీమ్ కోచ్ గా ద్రవిడ్ పనికి రాడని చాలా రోజులుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో బోర్డు ఈ అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. అదే సమయంలో సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఉన్న నేపథ్యంలో ఈ ఫార్మాట్ లో ఎంతో అనుభవజ్ఞుడైన ద్రవిడ్ ను కొనసాగించే సూచనలు ఉన్నాయి.

ద్రవిడ్ హెడ్ కోచ్ గా వచ్చిన తర్వత ఇండియా చెప్పుకోదగిన విజయాలేవీ సాధించలేదు. 2021 టీ20 వరల్డ్ కప్, 2022లో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఓడిపోయింది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరో కోచ్ కోసం బీసీసీఐ చేస్తోంది. ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటన్స్ కోచ్ గా సక్సెసైన ఆశిష్ నెహ్రాను సంప్రదించే అవకాశాలు ఉన్నా.. అతనికి ఈ పదవిపై ఆసక్తి లేదని అతని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ద్రవిడ్ హయాంలో తుది జట్టు ఎంపిక విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. తరచూ జట్టు కాంబినేషన్, కెప్టెన్ల మార్పు, ప్రయోగాల కారణంగా టీమిండియాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ద్రవిడ్ తన కోచింగ్ కాలాన్ని ఘనంగా ముగించాలనుకుంటే మాత్రం టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఒక్కటే మార్గం. అది ఇప్పటి వరకూ అతని హయాంలో తగిలిన అన్ని దెబ్బలకు మందుగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.