Kohli Lungi Dance: గ్రౌండ్‌లోనే లుంగీ డ్యాన్స్ పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
13 September 2023, 14:12 IST
- Kohli Lungi Dance: గ్రౌండ్‌లోనే లుంగీ డ్యాన్స్ పాటకు స్టెప్పులేశాడు విరాట్ కోహ్లి. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి డ్యాన్స్ చేయడం విశేషం.
విరాట్ కోహ్లి
Kohli Lungi Dance: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మాంచి ఊపు మీదున్నాడు. పాకిస్థాన్ పై సెంచరీ చేసిన తర్వాత అతని కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బ్యాట్ తో విఫలమైనా.. అతనిలో ఆ ఊపు మాత్రం తగ్గలేదు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్ లోనే అతడు లుంగీ డ్యాన్స్ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
శ్రీలంకతో సూపర్ 4 మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో లుంగీ డ్యాన్స్ పాట ప్లే చేశారు. అది విన్న విరాట్ కోహ్లి అదిరిపోయే స్టెప్పులేశాడు. దీంతో స్టాండ్స్ లోని ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ అతన్ని ఎంకరేజ్ చేశారు. ఆసియా కప్ శ్రీలంకలో జరుగుతున్నా.. అక్కడ ప్రతి మ్యాచ్ సందర్భంగానూ బాలీవుడ్ పాటలే వినిపిస్తున్నాయి. మన హిందీ పాటను లంక వాసులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ప్రతి ఓవర్ ముగియగానే స్టేడియం హిందీ పాటలతో హోరెత్తిపోతోంది. అలా మంగళవారం (సెప్టెంబర్ 12) కూడా ఈ లుంగీ డ్యాన్స్ పాట ప్ల చేయగా.. కోహ్లి స్టెప్పులేసి అందరినీ అలరించాడు. ఈ మ్యాచ్ లో లంకను ఇండియా 41 పరుగులతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై మొదట ఇండియా కేవలం 213 పరగులకే ఆలౌటైనా.. తర్వాత లంకను కూడా 172 పరుగులకే కట్టడి చేసింది.
బాల్ తో, బ్యాట్ తో శ్రీలంక ప్లేయర్ డునిత్ వెల్లలాగె ఇండియాను భయపెట్టాడు. 10 ఓవర్లలో 40 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీయడంతోపాటు.. బ్యాటింగ్ లోనూ చివరి వరకూ పోరాడి 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే మరోవైపు వికెట్ల పతనం కొనసాగడంతో లంకకు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో ఇండియా ఆసియా కప్ ఫైనల్ చేరింది.
ఇప్పుడు శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ విజేత ఫైనల్లో ఇండియాతో తలపడుతుంది. ఇది ఒకరకంగా సెమీఫైనల్ లాంటిదే. ఆసియా కప్ లో ఇండియా ఇప్పటి వరకూ 7 సార్లు టైటిల్ గెలిచింది. అయితే ఎప్పుడూ ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మాత్రం జరగలేదు. ఈసారి అది జరగాలంటే గురువారం (సెప్టెంబర్ 14) జరగబోయే మ్యాచ్ లో శ్రీలంకను పాకిస్థాన్ చిత్తు చేయాల్సి ఉంటుంది.