తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kl Rahul: అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను

KL Rahul: అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను

22 December 2024, 9:38 IST

google News
    • KL Rahul: కేఎల్ రాహుల్ ముంగిట ఓ అరుదైన రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో మెల్‍బోర్న్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో శతకం చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఈ రికార్డు ఏంటంటే.,
KL Rahul: అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను
KL Rahul: అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను (AP)

KL Rahul: అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డుపై కేఎల్ రాహుల్ కన్ను

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలక దశలో ఉంది. ఐదు టెస్టుల సిరీస్‍లో మూడు మ్యాచ్‍లు జరుగగా ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మెల్‍బోర్న్ వేదికగా నాలుగో టెస్టు డిసెంబర్ 26న మొదలుకానుంది. ఈ తరుణంలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఓ అదురైన హ్యాట్రిక్ సెంచరీల రికార్డుపై కన్నేశాడు. ఒకవేళ ఈ టెస్టులో శతకం చేస్తే అరుదైన ఘనత దక్కించుకుంటాడు. ఆ వివరాలివే..

బాక్సింగ్ డే హ్యాట్రిక్ సెంచరీపై..

మెల్‍బోర్న్‌లో ఆసీస్‍తో జరిగే నాలుగో టెస్టులో సెంచరీ సాధిస్తే రాహుల్ అరుదైన రికార్డు దక్కించుకుంటాడు. బాక్సింగ్ డే టెస్టుల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత సాధిస్తాడు. క్రిస్మస్ తర్వాతి రోజైన డిసెంబర్ 26న మొదలయ్యే టెస్టును బాక్సింగ్ డే టెస్టు అని అంటారు. 2021, 2023లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో కేఎల్ రాహుల్ సెంచరీలు చేశాడు.

2021లో సెంచూరియన్‍లో దక్షిణాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులతో శతకం చేశాడు కేఎల్ రాహుల్. 2023లో ఇదే వేదికలో బాక్సింగ్ డే మ్యాచ్‍లో సెంచరీ బాదాడు. ఇప్పుడు, 2024లో ఆస్ట్రేలియాతో మెల్‍బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్ శతకం సాధిస్తే అరుదైన రికార్డు సాధిస్తాడు. బాక్సింగ్ డే టెస్టులో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఘనత దక్కించుకుంటాడు. మరి రాహుల్ శతకం చేస్తాడేమో చూడాలి.

ఫామ్‍లో రాహుల్

ఆస్ట్రేలియాతో సిరీస్‍లో కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ నిలకడగా ఆడుతున్నాడు. మంచి టెక్నిక్ చూపిస్తున్నాడు. ఈ సిరీస్‍లో ఇప్పటి వరకు భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా రాహుల్ ఉన్నాడు. ఈ సిరీస్‍లో మూడు టెస్టుల్లో 235 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టులోనూ రాహుల్‍పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ టెస్టులో సెంచరీ చేస్తే బాక్సింగ్ డే శతకాలు రికార్డు దక్కుతుంది. ఆస్ట్రేలియాలో కేఎల్ రాహుల్ ఒకే ఒక బాక్సింగ్ డే టెస్టు 2014లో ఆడాడు. ఆ మ్యాచ్‍లో 3,1 పరుగులు మాత్రమే చేశాడు.

రాహుల్ చేతికి దెబ్బ

నాలుగో టెస్టు కోసం కేఎల్ రాహుల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. బంతి బలంగా అతడికి కుడి చేతికి తాకింది. దీంతో నొప్పితో బాధపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. అయితే, ఇది పెద్ద గాయం కాదని, నాలుగో టెస్టు ఆడతాడని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం