తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ireland Historic Win: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన పసికూన

Ireland Historic Win: చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. తొలి టెస్ట్ మ్యాచ్ గెలిచిన పసికూన

Hari Prasad S HT Telugu

01 March 2024, 19:54 IST

    • Ireland Historic Win: ఐర్లాండ్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ లో ఆ టీమ్ విజయం సాధించడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్ టీమ్ కు షాకిస్తూ 6 వికెట్లతో గెలిచింది.
ఐర్లాండ్ క్రికెట్ టీమ్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది
ఐర్లాండ్ క్రికెట్ టీమ్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది

ఐర్లాండ్ క్రికెట్ టీమ్ తొలి టెస్టు మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించింది

Ireland Historic Win: ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్టులో గెలిచిన ఐర్లాండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 6 వికెట్లతో విజయం సాధించింది. ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్ లో ఐర్లాండ్ టీమ్ నుంచి కొందరు ప్లేయర్స్ చేసిన అద్భుతమైన పోరాటంతో ఆ దేశం తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

టెస్టు గెలిచిన ఐర్లాండ్

ఐర్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య అబుధాబిలో ఈ ఏకైక టెస్టు మ్యాచ్ జరిగింది. ఫిబ్రవరి 28న ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. శుక్రవారం (మార్చి 1) ముగిసింది. మూడు రోజుల్లోనే ఐర్లాండ్ ఈ మ్యాచ్ ముగించడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీమ్ 155 రన్స్ కే ఆలౌటైంది. ఐర్లాండ్ పేసర్ మార్క్ అడైర్ 5 వికెట్లు తీయడంతో ఆఫ్ఘన్ కుప్పకూలింది.

ఆ తర్వాత ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో పాల్ స్టిర్లింగ్ (52) హాఫ్ సెంచరీతోపాటు కర్టిస్ కాంఫర్ (49), లోర్కాన్ టక్కర్ (42) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 263 రన్స్ చేసింది. దీంతో ఆ టీమ్ కు 108 రన్స్ లీడ్ లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆఫ్ఘనిస్థాన్ 218 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హజ్మతుల్లా షాహిది మాత్రమే 55 పరుగులతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లోనూ అడైర్ 3 వికెట్లు తీసుకున్నాడు.

దీంతో ఐర్లాండ్ ముందు కేవలం 111 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్ ను ఆ టీమ్ 4 వికెట్లు కోల్పోయి. 31.3 ఓవర్లలో ఛేదించింది. ఒక దశలో చేజింగ్ లో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. కెప్టెన్ బాల్‌బిర్నీ (58 నాటౌట్), లోర్కాన్ టక్కర్ (27 నాటౌట్) ఫైటింగ్ ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ కు చారిత్రక విజయాన్ని సాధించి పెట్టారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్ కు అజేయంగా 72 పరుగులు జోడించారు. టక్కర్ విన్నింగ్ రన్స్ కొట్టగానే ఐర్లాండ్ టీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఐర్లాండ్ టెస్ట్ జర్నీ ఇదీ

ఐర్లాండ్ టీమ్ తొలిసారి 2018లో టెస్టు మ్యాచ్ ఆడింది. ఆ టీమ్ కు టెస్ట్ హోదా లభించిన ఏడాది తర్వాత పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ ఆడింది. అందులో ఓడిపోయింది. ఆ తర్వాత 2023 వరకూ మొత్తంగా 7 టెస్టులు ఆడి అన్నింట్లోనూ పరాజయం పాలైంది. 2019లో ఇంగ్లండ్ చేతిలో రెండు టెస్టుల సిరీస్ ఆడి ఓడిపోయింది.

ఆ తర్వాత 2023లో నాలుగు టెస్టులు ఆడింది. ఈసారి బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంకలతో ఆడినా అన్నింట్లోనూ ఓటమి తప్పలేదు. మొత్తానికి తాము ఆడిన 8వ టెస్టులోనే ఐర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. తమకంటే బలమైన ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. 2018లో టెస్టు హోదా పొందిన 11వ దేశంగా ఐర్లాండ్ నిలిచింది. ఈక్రమంలో అత్యంత వేగంగా తొలి టెస్టు గెలిచిన దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఐర్లాండ్ నిలిచింది.

తదుపరి వ్యాసం