తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Start Date: ఐపీఎల్ 2025 మొదలయ్యేది ఆరోజే.. ఫైనల్ తేదీ కూడా రివీల్.. మూడు సీజన్ల డేట్స్ వెల్లడించిన బీసీసీఐ

IPL 2025 start date: ఐపీఎల్ 2025 మొదలయ్యేది ఆరోజే.. ఫైనల్ తేదీ కూడా రివీల్.. మూడు సీజన్ల డేట్స్ వెల్లడించిన బీసీసీఐ

Hari Prasad S HT Telugu

22 November 2024, 9:47 IST

google News
  • IPL 2025 start date: ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యే తేదీతోపాటు ఫైనల్ జరిగే తేదీని కూడా బీసీసీఐ రివీల్ చేసింది. అంతేకాదు వచ్చే మూడు సీజన్ల పాటు కూడా ఐపీఎల్ డేట్స్ నుంచి ముందే చెప్పేయడం విశేషం.

ఐపీఎల్ 2025 మొదలయ్యేది ఆరోజే.. ఫైనల్ తేదీ కూడా రివీల్.. మూడు సీజన్ల డేట్స్ వెల్లడించిన బీసీసీఐ
ఐపీఎల్ 2025 మొదలయ్యేది ఆరోజే.. ఫైనల్ తేదీ కూడా రివీల్.. మూడు సీజన్ల డేట్స్ వెల్లడించిన బీసీసీఐ (IPL)

ఐపీఎల్ 2025 మొదలయ్యేది ఆరోజే.. ఫైనల్ తేదీ కూడా రివీల్.. మూడు సీజన్ల డేట్స్ వెల్లడించిన బీసీసీఐ

IPL 2025 start date: ఐపీఎల్ 2025 మెగా వేలానికి రెండు రోజుల ముందు వచ్చే సీజన్ ప్రారంభ, ముగింపు తేదీలను నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 14న ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మే 25న జరుగుతుందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించిన ఈ ముఖ్యమైన తేదీలను కూడా ఇప్పటికే అనౌన్స్ చేసి.. మొత్తం పది ఫ్రాంఛైజీలకు సమాచారం అందించారు.

ఐపీఎల్.. వచ్చే మూడేళ్లు ఇలా..

ఐపీఎల్ 2025 కోసమే కాదు.. తొలిసారి వచ్చే మూడు సీజన్ల కోసం కూడా ఒకేసారి ప్రారంభ, ముగింపు తేదీలను గవర్నింగ్ కౌన్సిల్ అనౌన్స్ చేయడం విశేషం. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 14 నుంచి మే 25 వరకు జరగనుంది.

ఇక 2026 సీజన్ మార్చి 15 నుంచి మే 31 వరకు, 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరుగుతుందని కూడా గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ తేదీల మధ్య వచ్చే మూడు సీజన్ల పాటు ఐపీఎల్ జరుగుతుందని చెప్పగా.. ఇవే తొలి, ఫైనల్ మ్యాచ్ ల తేదీలు కానున్నాయి.

వచ్చే ఏడాది ఐపీఎల్ ఇలా..

ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ విషయానికి వస్తే.. 18వ సీజన్ లో భాగంగా మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. అందులో 70 లీగ్ మ్యాచ్ లు కాగా.. మిగిలిన నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్ లు ఉంటాయి. వచ్చే మూడేళ్ల పాటు ఈ తేదీల్లో ఐపీఎల్ ఆడటానికి విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే తమ బోర్డుల నుంచి అనుమతి తీసుకున్నట్లు కూడా ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్టు తెలిపింది.

వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్లేయర్స్ అందరికీ అనుమతి ఇవ్వడం గమనార్హం. అయితే 2026లో మాత్రం అదే సమయంలో పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. దీంతో ఆ ఏడాది కాస్త ఆలస్యంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ రానున్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలం

ఇక ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగనున్న విషయం తెలుసు కదా. ఈ వేలం తర్వాత మరోసారి అన్ని టీమ్స్ కొత్తగా కనిపించనున్నాయి. ఇప్పటికే ఆయా టీమ్స్ తమ ప్రధాన ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోగా.. మిగిలిన వారి కోసం వేలంలో పాల్గొనబోతున్నారు. ఈ వేలంలో పంత్, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మిచెల్ స్టార్క్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు.

మొత్తంగా 574 మంది ప్లేయర్స్ ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వీళ్లలో 204 ప్లేయర్స్ ను మాత్రమే ఫ్రాంఛైజీలు తీసుకునే వీలుంది. వాళ్లలో విదేశీ ప్లేయర్స్ గరిష్ఠంగా 70 మంది ఉంటారు. నవంబర్ 24, 25 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం అవుతుంది.

తదుపరి వ్యాసం