తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Hyderabad Schedule: ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు ఇవే.. అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే

IPL 2024 Hyderabad Schedule: ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు ఇవే.. అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే

Hari Prasad S HT Telugu

12 March 2024, 7:48 IST

    • IPL 2024 Hyderabad Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్ ను దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా ప్రస్తుతానికి పాక్షికంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్, వైజాగ్ లలో నాలుగు హైఓల్టేజ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు ఇవే.. అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే
ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు ఇవే.. అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే (X/Sunrisers Hyderabad)

ఐపీఎల్ 2024 తొలి షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్‌లలో మ్యాచ్‌లు ఇవే.. అన్నీ హైఓల్టేజ్ మ్యాచ్‌లే

IPL 2024 Hyderabad Schedule: ఐపీఎల్ 2024కు టైమ్ దగ్గర పడుతోంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఈ లీగ్ పూర్తి షెడ్యూల్ రాకపోయినా.. ఏప్రిల్ 7 వరకూ జరిగే 21 మ్యాచ్ ల షెడ్యూల్ మాత్రం వచ్చేసింది. అయితే వీటిలో నాలుగు హైఓల్టేజ్ మ్యాచ్ లు మన హైదరాబాద్, వైజాగ్ లలో జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024 SRH vs GT: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్.. హైదరాబాద్‌లో వర్షంతో టాస్ పడకుండానే జీటీతో మ్యాచ్ రద్దు

Nitish Kumar Reddy: ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌లో నితీష్ కుమార్ రెడ్డికి భారీ ధర.. ఐపీఎల్ మెరుపులే కారణం

Virat Kohli on retirement: మళ్లీ మీకు కనిపించను.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

ఐపీఎల్ 2024 హైదరాబాద్ షెడ్యూల్

ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అయితే తొలి విడత షెడ్యూల్లో మొత్తంగా 21 మ్యాచ్ లు ఉండగా.. అందులో రెండు మ్యాచ్ లు హైదరాబాద్ లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.

అందులో మొదటి మ్యాచ్ మార్చి 27న ఉంటుంది. తొలిసారి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్.. పటిష్టమైన ముంబై ఇండియన్స్ తో ఈ మ్యాచ్ లో తలపడనుంది. అటు ముంబై కూడా ఈసారి రోహిత్ ను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్, ముంబై మ్యాచ్ మార్చి 27 రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇక హైదరాబాద్ లో రెండో మ్యాచ్ ఏప్రిల్ 5వ తేదీన జరుగుతుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. దీంతో తొలి విడత షెడ్యూల్లో హైదరాబాద్ లో జరిగే రెండు మ్యాచ్ లూ హైఓల్టేజ్‌వే అని చెప్పొచ్చు. ముంబై, చెన్నైలాంటి టీమ్స్ లో అందరూ స్టార్లే. దీంతో ఈ రెండు మ్యాచ్ లు చూడటానికి హైదరాబాద్ ఫ్యాన్స్ ఎగబడటం ఖాయం.

ఐపీఎల్ 2024 వైజాగ్ షెడ్యూల్

ఇక ఐపీఎల్ 2024లో విశాఖపట్నం (వైజాగ్) నగరాన్ని తమ రెండో హోమ్ గ్రౌండ్ గా మార్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ఆ టీమ్ కొన్ని మ్యాచ్ లను ఇక్కడ కూడా ఆడుతుంది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా డీసీ.. వైజాగ్ లో రెండు మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా మార్చి 31న రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

డీసీలో రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్.. సీఎస్కేలో ధోనీ, జడేజా, రచిన్ రవీంద్రలాంటి ప్లేయర్స్ తో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇక వైజాగ్ లో రెండో మ్యాచ్ ఏప్రిల్ 3న రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. కేకేఆర్ లో ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈ లెక్కన తొలి విడత షెడ్యూల్లో హైదరాబాద్, వైజాగ్ లలో జరగబోయే నాలుగు మ్యాచ్ లూ హైఓల్టేజ్‌వే అని చెప్పొచ్చు.

తదుపరి వ్యాసం