తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Orange Cap: సెంచరీతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ మొత్తం మార్చేసిన సునీల్ నరైన్.. రోహిత్ స్థానాన్ని ఆక్రమించేశాడు

IPL 2024 Orange Cap: సెంచరీతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ మొత్తం మార్చేసిన సునీల్ నరైన్.. రోహిత్ స్థానాన్ని ఆక్రమించేశాడు

Hari Prasad S HT Telugu

17 April 2024, 7:50 IST

google News
    • IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ తో సెంచరీ తర్వాత కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. టీ20ల్లో తొలి సెంచరీతో చెలరేగినా.. నైట్ రైడర్స్ కు మాత్రం ఓటమి తప్పలేదు.
సెంచరీతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ మొత్తం మార్చేసిన సునీల్ నరైన్.. రోహిత్ స్థానాన్ని ఆక్రమించేశాడు
సెంచరీతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ మొత్తం మార్చేసిన సునీల్ నరైన్.. రోహిత్ స్థానాన్ని ఆక్రమించేశాడు (AFP)

సెంచరీతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ మొత్తం మార్చేసిన సునీల్ నరైన్.. రోహిత్ స్థానాన్ని ఆక్రమించేశాడు

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో టాప్ 2 టీమ్స్ మధ్య ఫైట్ ఎలా ఉండాలో సరిగ్గా అలాగే సాగింది రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక చేజింగ్ తో రాయల్స్ టీమ్ తాము ఈ సీజన్లో టాప్ ల ఎందుకు ఉన్నామో మరోసారి నిరూపించింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు.

మూడో స్థానానికి సునీల్ నరైన్

టీ20ల్లో తొలి సెంచరీ ద్వారా ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ లిస్టులో మూడో స్థానానికి దూసుకొచ్చాడు కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్. అతని సెంచరీ తన జట్టును గెలిపించలేకపోయినా.. తాను మాత్రం టాప్ బ్యాటర్స్ లిస్ట్ ను మార్చేశాడు. ప్రస్తుతం ఈ సీజన్లో విరాట్ కోహ్లి 7 మ్యాచ్ లలో 361 రన్స్ చేసి టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక రెండోస్థానంలో 318 రన్స్ తో ఆర్ఆర్ బ్యాటర్ రియాన్ పరాగ్ ఉన్నాడు.

తాజా సెంచరీతో కేకేఆర్ బ్యాటర్ సునీల్ నరైన్ మూడో స్థానంలోకి వచ్చాడు. అతడు 7 మ్యాచ్ లలో 276 రన్స్ చేశాడు. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా 276 పరుగులతో నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ చేసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇప్పుడు ఐదో స్థానానికి దిగజారాడు. అతడు 6 మ్యాచ్ లలో 261 రన్స్ చేశాడు.

ఇక సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ ను గెలిపించిన జోష్ బట్లర్ కూడా ఆరెంజ్ క్యాప్ లిస్టులో సీఎస్కే బ్యాటర్ శివమ్ దూబెను వెనక్కి నెట్టాడు. ఈ మ్యాచ్ లో కేవలం 60 బంతుల్లోనే 107 రన్స్ చేసిన బట్లర్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును క్రియేట్ చేయగలిగాడు. అతడు ప్రస్తుతం ఆరు మ్యాచ్ లలో 250 రన్స్ తో 8వ స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ లిస్ట్

ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ లిస్టులో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ తన టాప్ ప్లేస్ ను మరింత పదిలం చేసుకున్నాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో అతడు ఒకే వికెట్ తీశాడు. 7 మ్యాచ్ లలో 12 వికెట్లతో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ అతని దగ్గరే ఉంది. రెండో స్థానంలో పది వికెట్లతో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు.

దీంతో పర్పుల్ క్యాప్ కోసం ఈ ఇద్దరు ఇండియన్ బౌలర్ల మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. సీఎస్కే బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా 10 వికెట్లతోనే మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబాడా ఉన్నారు. ఈ ఇద్దరూ తొమ్మిదేసి వికెట్లు తీసుకున్నారు. అయితే ఎకానమీ రేటు పరంగా కమిన్స్ మెరుగ్గా ఉండటంతో అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.

తదుపరి వ్యాసం