తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Finals : మే 26న.. చెన్నైలో ఐపీఎల్​ ఫైనల్స్​!

IPL 2024 finals : మే 26న.. చెన్నైలో ఐపీఎల్​ ఫైనల్స్​!

Sharath Chitturi HT Telugu

24 March 2024, 14:30 IST

  • IPL 2024 schedule : ఐపీఎల్​ 2024 ఫైనల్​ మ్యాచ్​ చెన్నైలో జరగొచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి. క్వాలిఫయర్స్​, ఎలిమినేటర్​ వివరాలపై ఊహాగానాలు జరుగా సాగుతున్నాయి.

చెన్నైలో ఐపీఎల్​ 2024 ఫైనల్​ మ్యాచ్​?
చెన్నైలో ఐపీఎల్​ 2024 ఫైనల్​ మ్యాచ్​? (PTI / R Senthilkumar)

చెన్నైలో ఐపీఎల్​ 2024 ఫైనల్​ మ్యాచ్​?

IPL 2024 final date : ఐపీఎల్​ 2024 సగం షెడ్యూల్​ని మాత్రమే ప్రకటించింది బీసీసీఐ. మిగిలిన సగాన్ని.. 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడిన తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్​ మిగిలిన సీజన్​ని విదేశాల్లో నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్​లో మిగిలిన సగం కూడా ఇండియాలోనే ఉంటుంది! అంతేకాదు.. మే 26న చెన్నై వేదికగా ఫైనాల్​ మ్యాచ్​ జరుగుతుంది. ఇది క్రికెట్​ లవర్స్​తో పాటు సీఎస్​కే ఫ్యాన్స్​కి జోష్​ఇస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Sehwag on Mumbai Indians: రోహిత్, హార్దిక్ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుంది: సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Virat Kohli : బ్యాట్​ పట్టిన వామిక.. క్రికెటర్​ అవుతుందా? కోహ్లీ సమాధానం ఇది..

ipl 2024: కోట్లు పెట్టి కొంటే తుస్‌మ‌నిపించారు - ఈ ఐపీఎల్‌లో దారుణంగా ఫ్లాపైన రిచెస్ట్ క్రికెట‌ర్లు వీళ్లే!

CSK vs RCB : ఆర్సీబీ కోసం సీఎస్కే ప్రత్యేక 'అస్త్రం'- ధోనీని..

చెన్నైలో ఐపీఎల్​ 2024 ఫైనల్స్​..

ఐపీఎల్​లో అనాదిగా.. ఒక సంప్రదాయం ఉంది. ముందు సీజన్​లో కప్​ గెలిచిన జట్టు.. తదుపరి సీజన్​ మొదటి మ్యాచ్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​ని నిర్వహిస్తుంది. అందుకు తగ్గట్టుగానే.. ఈసారి ఐపీఎల్​ ఓపెనింగ్​ మ్యాచ్​ చెన్నై (2023 ఐపీఎల్​ విన్నర్​ సీఎస్​కే)లో జరిగింది. ఇక బీసీసీఐ సోర్స్​ ప్రకారం.. ఐపీఎల్​ ఫైనల్ మ్యాచ్​​ కూడా చెన్నైలోనే ఉంటుంది.

"ఐపీఎల్​ 2024 ఫైనల్​ చెన్నైలో జరగొచ్చు. ఇక దేశంలోనే అతిపెద్ద స్టేడియం.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఒక క్వాలిఫయర్​, ఎలిమినేటర్​ జరగొచచు. మరొక క్వాలిఫయర్​.. చెన్నైలోనే జరుగుతుంది," అని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- IPL 2024 Today: ఐపీఎల్‍లో నేడు డబుల్ ధమాకా- రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‍లు.. ఆ ఇద్దరిపైనే అందరి దృష్టి.. తుది జట్లు ఇలా!

IPL 2024 final match venue : చెన్నై అన్నా, చెన్నై సూపర్​ కింగ్స్​ అన్నా ముందుగా గుర్తొచ్చేది.. మహేంద్ర సింగ్​ ధోనీ. పైగా.. ఇదే అతని చివరి ఐపీఎల్​ అని వార్తలు జోరుగా సాగుతున్నాయి. మహేంద్రుడు తన కెప్టెన్సీని వదులుకోవడం.. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ తరుణంలో.. చెన్నైలో ఫైనల్​ మ్యాచ్​ జరుగుతుందన్న వార్తలు.. సీఎస్​కే, ధోనీ అభిమానులకు మంచి జోష్​ ఇస్తోంది. ఈసారి సీఎస్​కే ఫైనల్​కి వెళ్లాలని, ఎంఏ చిదంబరం స్టేడియంలో గెలిచి, ధోనీకి గ్రాండ్​గా గిఫ్ట్​ ఇవ్వాలని ఫ్యాన్స్​ కోరుకుంటున్నారు.

IPL 2024 final schedule : అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. వీటిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ఐపీఎల్​ 2024 మిగిలిన షెడ్యూల్​ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

‘ధోనీ సగం మ్యాచ్​లే ఆడతాడు..!’

ఐపీఎల్​ 2024 ఓపెనింగ్​ మ్యాచ్​లో ఆర్​సీబీతో తలపడింది చెన్నై సూపర్​ కింగ్స్​. మ్యాచ్​లో ఆల్​రౌండ్​ ప్రదర్శనతో చెన్నై జట్టు బోణీ కొట్టింది. అయితే.. మ్యాచ్​కి ముందు జరిగిన కామెంటరీలో గ్రిస్​ గేల్​.. ధోనీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇవి ధోనీ ఫ్యాన్స్​లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

"ఐపీఎల్​లో ధోనీ అన్ని మ్యాచ్​లు ఆడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మధ్య మధ్యలో బ్రేక్స్​ తీసుకోవచ్చు. అందుకే ఆ నిర్ణయం (కెప్టెన్సీని వదలుకోవడం) తీసుకుని ఉండొచ్చని నాకు అనిపిస్తోంది," అని అన్నాడు క్రిస్​ గేల్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం