MS Dhoni CSK : ఐపీఎల్‌ని ధోనీ మధ్యలోనే వదిలేస్తాడా? ఫ్యాన్స్‌కి మరో షాక్ తప్పదా?
MS Dhoni latest news : ఐపీఎల్ 2024లో ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడడా? ఇదే నిజమైతే.. ధోనీ ఫ్యాన్స్‌కి మరో షాక్ తప్పదా?
CSK vs RCB highlights : మహేంద్ర సింగ్ ధోనీ ఏ నిర్ణయం తీసుకున్నా అది షాకింగ్‌గానే ఉంటుంది! అతని ఫ్యాన్స్ షాక్‌కి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ఇటీవలే జరిగింది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు ధోనీ. దీనిని ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే.. వారికి కాస్త బాధ కలిగించే వార్త మరొకటి బయటకు వచ్చింది. ఐపీఎల్లో ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని.. వెస్టిండీస్ దిగ్గజం, ఆర్‌సీబీ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు.
'ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు..'
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడింది సీఎస్కే. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నై జట్టు బోణీ కొట్టింది. అయితే.. మ్యాచ్‌కి ముందు కామెంటరీ చేసిన గ్రిస్ గేల్.. ధోనీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఐపీఎల్లో ధోనీ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవచ్చు. అందుకే ఆ నిర్ణయం (కెప్టెన్సీని వదలుకోవడం) తీసుకుని ఉండొచ్చు," అని అన్నాడు క్రిస్ గేల్.
"ఏది ఏమైనా.. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ధోనీ యాక్టివ్గానే ఉన్నాడు," అని చెప్పుకొచ్చాడు.
MS Dhoni IPL 2024 : మహేంద్ర సింగ్ ధోనీ.. 2020 నుంచి ఐపీఎల్ తప్ప వేరే క్రికెట్ అడట్లేదు. అందుకే.. చాలా మంది అభిమానులు ఐపీఎల్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఐపీఎల్ నుంచి కూడా అతను రిటైర్ అయిపోతాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023లో ఈ విషయంపై చర్చ కాస్త ఎక్కువగా జరిగింది. కానీ ఫ్యాన్స్ కోసం ఐపీఎల్2024 కూడా అడతానని చెప్పాడు ధోనీ.
చెప్పిన మాట నిలబెట్టుకున్న ధోనీ.. ఐపీఎల్ 2024లో ఆడుతున్నాడు. కానీ కెప్టెన్సీని మాత్రం వదిలేశాడు. ఆ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్‌కి వెళ్లాయి.
MS Dhoni CSK captaincy : మరి క్రిస్ గేల్ చెప్పిన మాటలు నిజమైతే ధోనీ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే చాలా షాక్‌లు ఇచ్చిన ధోనీ.. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
సీఎస్కే వర్సెస్ ఆర్‌సీబీ..
CSK vs RCB : ఇక శుక్రవారం జరిగిన సీఎస్కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ స్టేడియంలో ఎప్పుడు తడబడే డూప్లెసిస్ సేన్.. ఈసారి మళ్లీ అదే రిపీట్ చేసింది. ఐపీఎల్ 2024 ఓపెనింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చెన్నై ఛేదించేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం