ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా శిఖర్ ధావన్

Photo: AP

By Chatakonda Krishna Prakash
Mar 23, 2024

Hindustan Times
Telugu

భారత సీనియర్ బ్యాటర్, ఐపీఎల్‍లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‍లో రికార్డు క్రియేట్ చేశాడు. 

Photo: ANI

ఐపీఎల్‍లో 900 బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) మార్కు దాటిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. 

Photo: ANI

ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 754 ఫోర్లు, 148 సిక్సర్లు బాదాడు ధావన్. దీంతో ఈ టోర్నీలో 902 బౌండరీలకు చేరుకున్నాడు. దీంతో ఈ టోర్నీలో 900 బౌండరీల ఫీట్ దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

Photo: PTI

ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో నేడు (మార్చి 23) జరిగిన మ్యాచ్‍లో ధావన్ 4 ఫోర్లు బాదాడు. ఈ మ్యాచ్‍తోనే ఐపీఎల్‍లో 900 బౌండరీల మైలురాయి అధిగమించాడు.  

Photo: ANI

ఐపీఎల్‍లో అత్యధిక బౌండరీల జాబితాలో ధావన్ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (878 - 643 ఫోర్లు, 235 సిక్సర్లు) ఉన్నాడు. మూడో ప్లేస్‍లో ముంబై స్టార్ రోహిత్ శర్మ (877) ఉన్నాడు. 

Photo: ANI

ఐపీఎల్ 2024లో తమ తొలి మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై నేడు (మార్చి 23) 4 వికెట్ల తేడాతో గెలిచి పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది.

Photo: AP

సజ్జలు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash