Ms Dhoni: ధోనీని టీమిండియా కెప్టెన్‌గా నేనే రికమండ్ చేశా - సచిన్ కామెంట్స్ వైరల్
Ms Dhoni: కెప్టెన్‌గా టీమిండియాకు ధోనీ ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. అయితే ధోనీని కెప్టెన్ చేయాలనే ఐడియాను బీసీసీఐకి తానే ఇచ్చానని సచిన్ టెండూల్కర్ కామెంట్స్ చేశాడు
Ms Dhoni: టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ధోనీ ఒకడు. గంగూలీ, సచిన్, గవాస్కర్ లాంటి దిగ్గజాలు సాధించలేని ఎన్నో అద్భుతమైన విజయాల్ని టీమిండియాకు సాధించిపెట్టాడు ధోనీ. 2007లో టీ20 వరల్డ్ కప్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్‌ను ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా అందుకున్నది. అంతే కాకుండా 2013లో టీమిండియా ధోనీ సారథ్యంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నది.
2007లో కెప్టెన్...
2007లో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను ధోనీకి అందించింది బీసీసీఐ. సచిన్, ద్రావిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలను పక్కనపెట్టి యంగ్ ప్లేయర్ అయిన ధోనీని టీమిండియా కెప్టెన్‌గా నియమించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. 2007 టీ20 వరల్డ్ కప్‌కు ముందు కెప్టెన్ బాధ్యతలను చేపట్టాడు ధోనీ. ఈ టోర్నీలో టీమిండియా ఏకంగా వరల్డ్ కప్ నెగ్గడంతో మూడు ఫార్మెట్స్‌కు ధోనీనే కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ.
ఆ సలహా నాదే...
అయితే ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించమని తానే బీసీసీఐకి సూచించినట్లు సచిన్ తెలిపాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌కు ముందు నాయకుడిగా టీమ్‌ను ముందుకు నడిపించమని నన్ను అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ శరద్ పవార్ కోరాడు. కెప్టెన్సీని స్వీకరించడానికి నా శరీరం సిద్ధంగా లేదు.
ధోనీతో కలిసి క్రికెట్ ఆడుతోన్నప్పుడు అతడితో తరచుగా మాట్లాడుతుండేవాడిని. మ్యాచ్ సిట్యువేషన్స్‌లో ఇలాంటి స్థితి నీకు ఎదురైతే ఏం చేసేవాడివని ధోనీని అడుగుతుండేవాడిని. నా ప్రశ్నలకు చాలా బ్యాలెన్సింగ్‌గా ధోనీ సమాధానాలు చెబుతుండేవాడు. మ్యాచ్ జరుగుతోన్నప్పుడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవాడు. అవన్నీ చూసే ధోనీ కెప్టెన్అయితే జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించగలడని అనిపించింది. అందుకే నా స్థానంలో ధోనీని కెప్టెన్ చేయమని బీసీసీకి చెప్పానని సచిన్ అన్నాడు. సచిన్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
ఐపీఎల్ బాధ్యతల నుంచి...
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. ధోనీ స్థానంలో ఈ సీజన్‌కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ ప్రచారం జరుగుతోంది. గత ఏడాది ధోనీ కాకుండా జడేజా సీఎస్‌కే కెప్టెన్‌గా కొనసాగాడు. కానీ జడేజా కెప్టెన్సీలో సీఎస్‌కే వరుసగా పరాజాయలు మూటగట్టుకోవడంతో ధోనీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.
అతడి సారథ్యంలో ఐపీఎల్ 2023 టైటిల్‌ను సీఎస్‌కే సొంతం చేసుకున్నది. ఈ ఏడాది మాత్రం ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడం అనుమానమేనని అంటున్నారు. మధ్యలోనే అతడు ఐపీఎల్ నుంచి తొలగిపోవచ్చునని చెబుతున్నారు.
కేవలం మెంటార్‌గానే వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. 2020 ఆగస్ట్ 15న ధోనీ ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ధోనీ 10773 రన్స్ చేశాడు. 90 టెస్లుల్లో 4876, 98 టీ20 మ్యాచ్‌లో 1617 రన్స్ చేశాడు.
టాపిక్