తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia 3rd Odi: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ఆ ఇద్దరికీ రెస్ట్.. తిరిగి రానున్న కోహ్లి, రోహిత్

India vs Australia 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డేకు ఆ ఇద్దరికీ రెస్ట్.. తిరిగి రానున్న కోహ్లి, రోహిత్

Hari Prasad S HT Telugu

25 September 2023, 10:14 IST

google News
    • India vs Australia 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ లకు రెస్ట్ ఇచ్చింది టీమిండియా. ఇక స్టార్ ప్లేయర్స్ కోహ్లి, రోహిత్ తిరిగి రానున్నారు.
ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేకు శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ లకు రెస్ట్
ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేకు శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ లకు రెస్ట్ (PTI)

ఇండియా, ఆస్ట్రేలియా మూడో వన్డేకు శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ లకు రెస్ట్

India vs Australia 3rd ODI: ఆస్ట్రేలియాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలిచిన టీమిండియా.. చివరిదైన మూడో వన్డే కోసం ఇద్దరు ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చింది. రెండో వన్డేలో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ లను ఈ మ్యాచ్ కోసం పక్కన పెట్టింది. ఈ ఇద్దరూ మూడో మ్యాచ్ కోసం టీమ్ తో కలిసి రాజ్‌కోట్ వెళ్లడం లేదు.

అయితే మూడో వన్డే కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తిరిగి రానున్న విషయం తెలిసిందే. వీళ్లు రాజ్‌కోట్ లో నేరుగా జట్టుతో కలుస్తారు. ఇక శుభ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ జరిగే గువాహటిలో తిరిగి టీమ్ తో చేరుతారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో టాప్ ఫామ్ లో ఉన్న గిల్.. వన్డేల్లో ఆరో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

వన్డేల్లో ఈ ఏడాది గిల్ 20 ఇన్నింగ్స్ లో ఏకంగా 1230 రన్స్ చేశాడు. సగటు 72.35 కాగా.. స్ట్రైక్ రేట్ 105.03 కావడం విశేషం. న్యూజిలాండ్ పై రెండు సెంచరీలు.. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై ఒక్కో సెంచరీ చేశాడు. ఇక తన సొంతగడ్డ మొహాలీలో ఆస్ట్రేలియాతోనే తొలిసారి గిల్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అతడు 75 రన్స్ చేశాడు.

మొహాలీలో ఆడటంపై గిల్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. "నేను ఏడేళ్ల వయసులో తొలిసారి మొహాలీ వచ్చాను. ఓ ప్రేక్షకుడిగా ఇక్కడ ఎన్నో మ్యాచ్ లు చూసిన నేను.. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం కల నిజమవడంలాంటిదే. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినా.. అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం మాత్రం ప్రత్యేకం" అని గిల్ అన్నాడు.

ఆసియా కప్ తోపాటు ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లో శుభ్‌మన్ కు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించింది. వరల్డ్ కప్ లో ఫ్రెష్ గా బరిలోకి దిగాలంటే అతనికి రెస్ట్ అవసరం. దీంతో మూడో వన్డేకు అతన్ని పక్కన పెట్టారు. రెండో వన్డేలో బుమ్రాకు కూడా రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో ఈ ఇద్దరూ తప్ప మిగతా వరల్డ్ కప్ టీమ్ అంతా బరిలోకి దిగే అవకాశం ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వాట్సాప్ ఛానెల్‌లో చేరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందండి. ఈ లింక్ ద్వారా మా ఛానెల్‌లో చేరండి.

తదుపరి వ్యాసం