IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు: సిరీస్ ఆధిపత్యం కోసం పోరు: పిచ్, తుది జట్లు, టైమ్, లైవ్ వివరాలు ఇవే
14 February 2024, 21:46 IST
- IND vs ENG 3rd Test Preview: మూడో టెస్టు పోరుకు భారత్, ఇంగ్లండ్ సన్నద్ధమయ్యాయి. సిరీస్ ఆధిపత్యం కోసం జరిగే ఈ మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 15) మొదలుకానుంది. ఈ టెస్టు వివరాలివే..
IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు: సిరీస్ ఆధిపత్యం కోసం పోరు
IND vs ENG 3rd Test: చిన్న గ్యాప్ తర్వాత మళ్లీ హోరాహోరీగా తలపడేందుకు భారత్, ఇంగ్లండ్ రెడీ అయ్యాయి. ఇరు జట్ల మధ్య రాజ్‍కోట్ వేదికగా గురువారం (ఫిబ్రవరి 15) మూడో టెస్టు మొదలుకానుంది. ఐదు టెస్టుల సిరీస్‍లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‍లు జరగగా.. 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‍లో ఆధిపత్యం సాధించాలనే కసితో మూడో టెస్టుకు ఇరు జట్లు బరిలోకి దిగేందుకు సన్నద్ధయమ్యాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ విశాఖపట్నం టెస్టులో గెలిచి ఉత్సాహంగా ఉంది. అయితే, విరాట్ కోహ్లీ ఇంకా అందుబాటులోకి రాకపోవడం, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‍కు కూడా దూరమవడం ప్రతికూలతగా ఉంది. భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు వివరాలు ఇక్కడ చూడండి.
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు టైమ్
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు గురువారం (ఫిబ్రవరి 15) షురూ కానుంది. ప్రతీ రోజు ఉదయం 9:30 గంటలకు ఆట మొదలవుతుంది. తొలి రోజు టాస్ 9 గంటలకు ఉంటుంది. రాజ్‍కోట్‍లో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (SCA) గ్రౌండ్‍లో ఈ మ్యాచ్ జరగనుంది.
లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్
భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ‘స్పోర్ట్ 18’ నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. డిజిటల్ విషయానికి వస్తే.. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
పిచ్ ఎలా..
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు జరిగే రాజ్‍కోట్ ఎస్‍సీఏ పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉంటుంది. రఫ్ ప్యాచెస్ ఉండటంతో స్పిన్నర్లకు కూడా సహకరిస్తుంది. పగుళ్లు అంత త్వరగా ఏర్పడకపోవచ్చు. పచ్చిక కూడా ఉండటంతో కొత్త బంతితో పేసర్లకు తోడ్పాటు లభించవచ్చు. అయితే, మూడో రోజు నుంచి ఈ పిచ్‍పై స్పిన్నర్లకు అధికంగా సహకారం లభించొచ్చు. టర్న్ కూడా బాగానే దక్కొచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
భారత్‍లో ఇద్దరు అరంగేట్రం
ఇంగ్లండ్‍తో జరిగే ఈ మూడో టెస్టుతో టీమిండియా టెస్టు జట్టులోకి యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేంట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లేకపోవటంతో సర్ఫరాజ్‍కు చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎస్ భరత్ స్థానంలో జురెల్‍ను మేనేజ్‍మెంట్ పరిగణనలోకి తీసుకుంటోందని తెలుస్తోంది.
మూడో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ కాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ / కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఓ మార్పుతో ఇంగ్లండ్
మూడో టెస్టుకు ఒక రోజు ముందే తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో పేసర్ మార్క్ వుడ్‍ను టీమ్‍లోకి తీసుకుంది. ఇక, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టుగా ఉండనుంది.
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్