Ashwin 500th Wicket: అశ్విన్‌కు 500వ వికెట్‌ను దూరం చేసిన డీఆర్ఎస్.. విశాఖ టెస్టులో హైడ్రామా-ashwins 500th wicket denied after drs india vs england 2nd test match highlights ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin 500th Wicket: అశ్విన్‌కు 500వ వికెట్‌ను దూరం చేసిన డీఆర్ఎస్.. విశాఖ టెస్టులో హైడ్రామా

Ashwin 500th Wicket: అశ్విన్‌కు 500వ వికెట్‌ను దూరం చేసిన డీఆర్ఎస్.. విశాఖ టెస్టులో హైడ్రామా

Hari Prasad S HT Telugu
Feb 05, 2024 02:49 PM IST

Ashwin 500th Wicket: టెస్ట్ క్రికెట్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు 500 వికెట్ ను దూరం చేసింది డీఆర్ఎస్. ఈ సమయంలో ఫీల్డ్ లో హైడ్రామా నెలకొంది.

టెస్టుల్లో తన 500వ వికెట్ తీయలేకపోయిన అశ్విన్
టెస్టుల్లో తన 500వ వికెట్ తీయలేకపోయిన అశ్విన్ (ANI)

Ashwin 500th Wicket: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు 500వ వికెట్ దక్కినట్లే దక్కి దూరమైంది. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టు నాలుగో రోజు రెండో సెషన్ లో జరిగిన ఓ ఘటన ఫీల్డ్ లో హైడ్రామాకు దారి తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్ టామ్ హార్ట్‌లీని ఔట్ చేసి టెస్టుల్లో తన ల్యాండ్ మార్క్ 500వ వికెట్ తీశానని సంబరాలు చేసుకున్న అశ్విన్ కు, టీమిండియాకు షాక్ తగిలింది.

అశ్విన్‌కు ఆ వికెట్ ఎందుకు దక్కలేదు?

అశ్విన్ బౌలింగ్ లో హార్ట్‌లీ వికెట్ల ముందు దొరికిపోయాడు. అదే సమయంలో వికెట్ల వెనుక ఆ బాల్ ను క్యాచ్ కూడా పట్టుకున్నారు. ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫనీ దానిని ఔట్ ఇచ్చాడు. దీంతో అశ్విన్ తోపాటు టీమిండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అయితే హార్ట్‌లీ వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ రీప్లేలను గమనించాడు.

బంతి హార్ట్‌లీ చేతిని తాకిట్లు తేలింది. అది అంపైర్స్ కాల్ గా తేలడంతోపాటు వికెట్లను తగలడం కూడా అంపైర్ కాల్ అనే వచ్చింది. అప్పటికే ఫీల్డ్ అంపైర్ ఔటివ్వడంతో ఇక అతడు ఔటైనట్లే అని టీమిండియా సభ్యులు, స్టేడియంలోని ప్రేక్షకులు ఆనందంతో గంతులేశారు. కానీ అనూహ్యంగా థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని అంగీకరించలేదు.

అసలు ఏం జరిగింది?

థర్డ్ అంపైర్ నిర్ణయం టీమిండియా ప్లేయర్స్ నే కాదు.. కామెంటేటర్లను, ప్రేక్షకులను గందరగోళానికి గురి చేసింది. అంపైర్ కాల్ వచ్చినప్పుడు ఔటివ్వాలి కదా అని అందరూ భావించారు. ఆ సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న రవిశాస్త్రి, ఇయాన్ మోర్గాన్ కూడా కాస్త అయోమయానికి గురయ్యారు. అయితే అక్కడ జరిగింది మాత్రం మరోలా ఉంది.

అశ్విన్ వేసిన బాల్.. హార్ట్‌లీ చేతిని తగిలి గాల్లోకి లేవగా అది లెగ్ స్లిప్ లో క్యాచ్ పట్టుకున్నారు. అది క్యాచ్ ఔట్ గా భావించిన హార్ట్‌లీ వెంటనే మూడో అంపైర్ రివ్యూ తీసుకున్నాడు. మూడో అంపైర్ బంతి అతని గ్లోవ్ లేదా బ్యాట్ కు తగిలిందా లేదా అన్నది పరిశీలించాడు. కానీ బంతి చేతికి తగలడంతో నాటౌట్ గా ప్రకటించాడు. నిజానికి ఫీల్డ్ అంపైర్ అతన్ని క్యాచ్ ఔట్ గా ప్రకటించాడు.

ఎల్బీడబ్ల్యూ విషయంలో అతడు కూడా నాటౌట్ అనే చెప్పాడు. దీంతో క్యాచ్ ఔట్ ను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ అని తేల్చేశాడు. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్ కాల్ వచ్చినా.. అప్పటికే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని చెప్పడంతో హార్ట్ లీ అలా బతికిపోయాడు. అశ్విన్ కు తన 500వ వికెట్ దక్కలేదు. మ్యాచ్ లో ఇక ఆ తర్వాత అతనికి మరో వికెట్ పడలేదు. దీంతో 500వ వికెట్ కోసం అతడు మూడో టెస్టు వరకూ వేచి చూడాల్సిందే.

మరోవైపు అశ్విన్ కు రికార్డు దక్కకపోయినా.. టీమిండియా మాత్రం ఈ మ్యాచ్ లో 106 పరుగుల తేడాతో గెలిచి 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ లో జరగనుంది.

Whats_app_banner