తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Eng 3rd Test: రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ - గిల్ డ‌కౌట్ - లంచ్ టైమ్‌కు టీమిండియా స్కోరు ఎంతంటే?

IND vs ENG 3rd Test: రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీ - గిల్ డ‌కౌట్ - లంచ్ టైమ్‌కు టీమిండియా స్కోరు ఎంతంటే?

15 February 2024, 12:37 IST

google News
  • IND vs ENG 3rd Test: రాజ్ కోట్ టెస్ట్‌లో టీమిండియాను రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీతో గ‌ట్టెక్కించాడు. 33 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా లంచ్ విరామానికి 93 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, జ‌డేజా క్రీజులో ఉన్నారు.

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్
ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్

ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మైన మూడో టెస్ట్‌లో టీమిండియా త‌డ‌బ‌డి నిల‌బ‌డింది. 33 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. లంచ్ విరామానికి టీమిండియా 25 ఓవ‌ర్ల‌లో 93 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ 52 ప‌రుగుల‌తో, జ‌డేజా 24 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

రోహిత్ ఫ‌స్ట్ హాఫ్ సెంచ‌రీ...

ఈ సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌కు ఇదే ఫ‌స్ట్ హాఫ్ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్‌తో పాటు వైజాగ్ టెస్టులో విఫ‌ల‌మైన రోహిత్ శ‌ర్మ రాజ్ కోట్‌లో మాత్రం ప‌ట్టుద‌ల‌తో క్రీజులో నిలిచాడు. త‌న దూకుడు శైలికి భిన్నంగా ఇంగ్లండ్ పేస‌ర్ల‌ను ఎదుర్కొంటూ ఆచితూచి ఆడాడు. వికెట్ల ప‌తనాన్ని అడ్డుకున్నాడు.

రోహిత్ శ‌ర్మ కూడా ఔట్ కావాల్సింది. 27 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద హ‌ర్ట్‌లీ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో రూట్ మిస్ చేశాడు. దాంతో రోహిత్ బ‌తికిపోయాడు. మ‌రోసారి అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో ఎల్‌బీడ‌బ్ల్యూగా రోహిత్ ఔట‌య్యాడ‌ని భావించిన ఇంగ్లండ్ టీమ్ రివ్యూ కోరింది.

కానీ రివ్యూల్‌లో బాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌గా తేల‌డంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను రోహిత్‌, జ‌డేజా జోడీ స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న‌ది. రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ దూరం కావ‌డంతో జ‌డేజాకు బ్యాటింగ్‌లో ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగాడు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు.

దెబ్బ‌కొట్టిన మార్క్‌వుడ్‌…

రాజ్‌కోట్ టెస్ట్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఇంగ్లండ్ పేస‌ర్ మార్క్‌వుడ్ దెబ్బ‌కొట్టాడు. షోయ‌బ్ బ‌షీర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన మార్క‌వుడ్ సెకండ్ టెస్ట్ హీరో య‌శ‌స్వి జైస్వాల్‌లో ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. 10 ప‌రుగులు చేసిన య‌శ‌స్వి జైస్వాల్ పెవిలియ‌న్ చేరుకున్నాడు.

రెండో టెస్ట్‌లో సెంచ‌రీ చేసి ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపించిన శుభ్‌మ‌న్ గిల్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. డ‌కౌట్ అయ్యాడు. తొమ్మిది బాల్స్ ఎదుర్కొన్న గిల్ మార్క‌వుడ్ బౌలింగ్‌లో కీప‌ర్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరుకున్నాడు. రజ‌త్ పాటిదార్ మ‌రోసారి త‌న పూర్ ఫామ్‌ను కొన‌సాగించాడు. కేవ‌లం ఐదు ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురేల్ ఎంట్రీ...

మూడో టెస్ట్ ద్వారా టీమిండియా త‌ర‌ఫున స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ధ్రువ్ జురేల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. భ‌ర‌త్ కోన స్థానంలో ధ్రువ్ జురేల్‌, కేఎల్ రాహుల్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. స‌ర్ఫ‌రాజ్‌కు అనిల్ కుంబ్లే క్యాప్ అంద‌జేశాడు. కుంబ్లే నుంచి క్యాప్ అందుకుంటూ స‌ర్ఫ‌రాజ్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. రెండో టెస్ట్‌కు దూర‌మైన జ‌డేజా, సిరాజ్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చారు.

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా, ఇంగ్లండ్ 1-1తో స‌మంగా ఉన్నారు. హైద‌రాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొంద‌గా...వైజాగ్ టెస్ట్‌లో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో విరాట్ కోహ్లి దూర‌మ‌య్యాడు. గాయంతో కేఎల్ రాహుల్ కూడా మిగిలిన టెస్ట్‌ల‌ను ఆడ‌టం లేదు.

For latest cricket news, live scorestay connected with HT Telugu
తదుపరి వ్యాసం