తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus Free Streaming: కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే.. ఈ మ్యాచ్ ఫ్రీగా ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Ind vs Aus free streaming: కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే.. ఈ మ్యాచ్ ఫ్రీగా ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

22 September 2023, 10:29 IST

google News
    • Ind vs Aus free streaming: కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ ను ఫ్రీగా చూడొచ్చు. జియో సినిమా ఓటీటీ ఈ వన్డే సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
మొహాలీలో పిచ్ ను పరిశీలిస్తున్న శుభ్‌మన్ గిల్
మొహాలీలో పిచ్ ను పరిశీలిస్తున్న శుభ్‌మన్ గిల్ (AFP)

మొహాలీలో పిచ్ ను పరిశీలిస్తున్న శుభ్‌మన్ గిల్

Ind vs Aus free streaming: వరల్డ్ కప్ 2023కు ముందు ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ రిహార్సల్ సిరీస్ కు సిద్ధమయ్యాయి. శుక్రవారం (సెప్టెంబర్ 22) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మొహాలీలో జరగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 24న ఇండోర్ లో, మూడో వన్డే సెప్టెంబర్ 27న రాజ్‌కోట్ లో జరగనున్నాయి.

ఆసియా కప్ 2023 గెలిచిన తర్వాత ఇండియా పెద్దగా గ్యాప్ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్ బరిలోకి దిగనుంది. తొలి రెండు వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా మూడు వన్డేలు ఓడిపోయి 5 వన్డేల సిరీస్ ను 2-3తో కోల్పోయిన తర్వాత ఇండియా సిరీస్ కోసం వచ్చింది ఆస్ట్రేలియా టీమ్.

పైగా తొలి వన్డేకు స్టార్క్, మ్యాక్స్‌వెల్ లాంటి కీలకమైన ప్లేయర్స్ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ సిరీస్ లో ఎలా తలపడతాయన్నది చూడాలి. రోహిత్, విరాట్, హార్దిక్, కుల్దీప్ లేకుండానే తొలి రెండు వన్డేలు ఆడుతున్న ఇండియన్ టీమ్.. ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టును ఢీకొట్టడం అంత సులువు కాదు. అయితే వరల్డ్ కప్ కు ముందు బెంచ్ స్ట్రెంత్ పరీక్షించడానికి, సూర్య, అశ్విన్ లాంటి వాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ కు కూడా ఈ సిరీస్ పరీక్షగా మారనుంది. ఇక హైదరాబాదీ యువ బ్యాటర్ తిలక్ వర్మ వన్డేల్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అక్షర్ పటేల్ గాయపడటంతో తెరపైకి వచ్చిన అశ్విన్.. వరల్డ్ కప్ టీమ్ లో చోటు సంపాదించాలంటే ఆస్ట్రేలియాతో సిరీస్ లో రాణించడం చాలా అవసరం.

ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే స్ట్రీమింగ్

ఇండియా, ఆస్ట్రేలియా తొలి వన్డే మొహాలీలో జరగనుంది. శుక్రవారం (సెప్టెంబర్ 22) మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ ఒంటిగంటకు ఉంటుంది. ఈ మ్యాచ్ ను టీవీలో అయితే స్పోర్ట్స్ 18 ఛానెల్లో చూడొచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై అయితే జియో సినిమా వెబ్‌సైట్, యాప్ లో ఫ్రీగా చూసే వీలుంది.

తదుపరి వ్యాసం